భారీ దాడులకు ప్లాన్‌.. ఉగ్రవాదులు హతం

తాజా వార్తలు

Updated : 26/01/2020 01:57 IST

భారీ దాడులకు ప్లాన్‌.. ఉగ్రవాదులు హతం

శ్రీనగర్‌: గణతంత్ర దినోత్సవం సందర్భంగా దాడులు చేయాలన్న ఉగ్రవాదుల కుట్రను సైన్యం భగ్నం చేసింది. గతేడాది పుల్వామాలో ఉగ్రవాదులు చేసిన దాడిలో 40 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే, ఆ దాడుల్లో కీలక పాత్ర పోషించిన జైష్‌-ఏ-మహమ్మద్‌ ఉగ్రవాద సంస్థ కీలక నేత క్వారీ యాసిర్‌ను బలగాలు శనివారం హతం చేశాయి. కశ్మీర్‌లోని అవంతిపురలో ఉగ్రవాదులున్నట్లు సమాచారం అందుకున్న అధికారులు నిఘా పెంచారు. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో యాసిర్‌తో పాటు మరో ముగ్గురు ఉగ్రవాదులు మృతిచెందారు. దీనికి సంబంధించిన వివరాలను లెఫ్టినెంట్‌ జనరల్‌ కేజేఎస్‌ దిల్లన్‌, ఐజీ విజయ్‌కుమార్‌ మీడియాకు తెలిపారు. జనవరి 26న గణతంత్ర వేడుకల నేపథ్యంలో భారీ దాడులకు ఉగ్రవాదులు పన్నాగం పన్నినట్లు వారు తెలిపారు. కాగా.. దాడులు ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని