ముంబయి జీఎస్టీ భవనంలో భారీ అగ్నిప్రమాదం

తాజా వార్తలు

Published : 17/02/2020 16:05 IST

ముంబయి జీఎస్టీ భవనంలో భారీ అగ్నిప్రమాదం

ముంబయి: మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని వస్తు సేవల పన్ను(జీఎస్టీ) కార్యాలయంలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో మంటలు ఆర్పేందుకు దాదాపు 16 ఫైరింజన్లు రంగంలోకి దిగాయి. ఓ అధికారి తెలిపిన సమాచారం ప్రకారం.. మజగావ్ ప్రాంతంలోని జీఎస్టీ కార్యాలయం 8వ అంతస్థులో ఈరోజు మధ్యాహ్నం 12.30గంటలకు అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో మంటల్ని ఆర్పేందుకు 16 ఫైరింజన్లు రంగంలోకి దిగినట్లు వెల్లడించారు. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఆయన చెప్పారు. ప్రమాదానికి గల కారణాల్ని విచారణలో కనుగొనాల్సి ఉందని తెలిపారు. ముంబయిలో ఉన్న ఈ 9 అంతస్థుల భవనాన్ని గతంలో సేల్స్‌ ట్యాక్స్‌ కార్యాలయంగా పిలిచేవారు. కాగా కేంద్రం వస్తుసేవల పన్ను అమల్లోకి తెచ్చినప్పటి నుంచి దీని పేరు జీఎస్టీ కార్యాలయంగా మారింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని