ముఖానికి లైట్‌ వేశాడని.. కడతేర్చాడు..!

తాజా వార్తలు

Published : 08/03/2020 18:45 IST

ముఖానికి లైట్‌ వేశాడని.. కడతేర్చాడు..!

ముంబయి: ముఖానికి టార్చి లైట్‌ వేశాడన్న కోపంతో ఎదుటి వ్యక్తిని కడతేర్చాడో యువకుడు. ఉత్తర ముంబయిలోని కురార్‌ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబయిలోని కురార్‌ ప్రాంతానికి చెందిన అభిషేక్‌ చౌహాన్‌ అనే వ్యక్తి ఇటీవల నిర్మాణంలో ఉన్న ఓ భవనంలోకి వెళ్లాడు. టార్చి లైట్‌ వేసుకుని భవనం ఎక్కుతుండగా.. మెట్లపై అభిచంద్ర యాదవ్‌ అనే వ్యక్తి కూర్చుని ఉన్నాడు. ఈ క్రమంలో మెట్లపై ఉన్న వ్యక్తిని గుర్తించేందుకు చౌహాన్‌ అతడి ముఖానికి టార్చి లైట్‌ వేశాడు. దీంతో చౌహాన్‌పై ఆ వ్యక్తి తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశాడు. ముఖానికి లైట్‌ వేస్తావా అంటూ చౌహాన్‌తో వాగ్వాదానికి దిగాడు. అది కాస్తా ముదరడంతో యాదవ్‌ నాలుగో అంతస్థు నుంచి ఆ వ్యక్తిని తోసేశాడు. దీంతో చౌహాన్‌ అక్కడికక్కడే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అనంతరం పోలీసులు నిందితుడిపై హత్య నేరం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని