పోలీసులపై రాళ్ల దాడి..పలువురికి గాయాలు

తాజా వార్తలు

Published : 23/04/2020 00:26 IST

పోలీసులపై రాళ్ల దాడి..పలువురికి గాయాలు

కోల్‌కతా: నిత్యావసరాలు అందించాలని ఆందోళన నిర్వహించిన స్థానికులు వారించిన పోలీసుపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం బదురియా ప్రాంతంలోని దస్పరాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దస్పరా ప్రాంతం ప్రజలు లాక్‌డౌన్‌ సమయంలో అందే నిత్యావసరాల కోసం బుధవారం ఉదయం నుంచి రాస్తారోకో నిర్వహించి ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ పోలీసుల మాట వినకుండా వాగ్వాదానికి దిగారు. అనంతరం వారిపై రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు ఆందోళనకారులపై లాఠీఛార్జి చేసి పరిస్థితిని నియంత్రణలోకి తెచ్చారు.

ఈ ఘటనలో ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి. పలువురు ఆందోళనకారులు సైతం గాయపడ్డారు. ఈ ఘటనపై రాష్ట్ర ఆహార సరఫరా మంత్రి జ్యోతిప్రియో ముల్లిక్‌ స్పందించారు. ప్రభుత్వం వారికి ఇవ్వాల్సిన నిత్యావసర సరకులు ఇదివరకే అందించిందని వెల్లడించారు. ఇదంతా కౌన్సిలర్‌ స్థానికులకు ఇచ్చిన వాగ్ధానం వల్ల జరిగిందని పేర్కొన్నారు. కౌన్సిలర్‌ తరఫున అదనపు నిత్యావసరాలు అందిస్తామని స్థానికులకు మాటిచ్చి నెరవేర్చకపోవడంతో వారు ఆందోళనకు దిగినట్లు తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని