50 కాకులు, 3 కుక్కలు మృతి

తాజా వార్తలు

Updated : 24/04/2020 07:05 IST

50 కాకులు, 3 కుక్కలు మృతి

నమూనాలు సేకరించిన పశుసంవర్ధక అధికారులు

 చెన్నై: తమిళనాడు, నాగపట్టణం జిల్లా పూంపుహార్‌లో గురువారం మూడు కుక్కలు, 50 కాకులు మృతి చెందాయి. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వీటి మృతితో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో గ్రామ పంచాయతీ అధ్యక్షుడు పశుసంవర్ధక అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనాస్థలానికి చేరుకుని కుక్కలు, కాకుల కళేబరాల నుంచి నమూనాలను సేకరించారు. పరీక్షించిన అనంతరం వాటి మృతికి గల కారణాలు వెల్లడిస్తామని తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని