కూలీలపై దూసుకెళ్లిన గూడ్స్‌రైలు: 16 మంది మృతి

తాజా వార్తలు

Updated : 08/05/2020 10:38 IST

కూలీలపై దూసుకెళ్లిన గూడ్స్‌రైలు: 16 మంది మృతి

ఔరంగబాద్‌: మహారాష్ట్రలోని ఔరంగబాద్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కర్మాడ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ట్రాక్‌పై నిద్రిస్తున్న వలస కూలీలపై గూడ్స్‌ రైలు దూసుకెళ్లింది. ఈప్రమాదంలో 16 మంది మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఔరంగబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో, ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు. మృతులంతా మధ్యప్రదేశ్‌కు వెళ్తున్న వలస కార్మికులుగా గుర్తించారు. పట్టాలపై నిద్రిస్తున్న వారిని రైలు వేగంగా ఢీకొనడంతో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. మహారాష్ట్రలోని జాల్‌నా నుంచి వలస కూలీలు మధ్యప్రదేశ్‌కు రైలు పట్టాలను అనుసరిస్తూ బయల్దేరారు. మార్గమధ్యంలో విశ్రాంతికోసం నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.  కర్మాడ్‌ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వలస కార్మికులు గూడ్స్‌రైలును రాకను గమనించకపోవడమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఆర్పీఎఫ్‌, రైల్వే ఉన్నతాధికారులు ఘటనాస్థలికి బయల్దేరారు.

మహారాష్ట్రలో జరిగిన రైలు ప్రమాద ఘటనపై ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు దిగ్భ్రంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యసహాయం అందించాలని సూచించారు.

 
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని