కారు బోల్తా: ఇద్దరి మృతి

తాజా వార్తలు

Published : 22/05/2020 01:41 IST

కారు బోల్తా: ఇద్దరి మృతి

రఘునాథపల్లి: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కోమల్లలోతువాగు సమీపంలో జాతీయ రహదారిపై ఈరోజు ఉదయం కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు. రఘునాథపల్లి ఎస్సై అశోక్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. హన్మకొండ పల్లెవెలుపు ప్రాంతానికి చెందిన చింతల రమేశ్‌బాబు(47), పాలకుర్తి మండలం బొమ్మెర గ్రామానికి చెందిన కారు డ్రైవర్‌ బానోత్‌ రమేశ్‌(25) వరంగల్‌ నుంచి హైదరాబాద్‌కు కారులో బయల్దేరారు. కోమల్లలోతువాగు వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈఘటనలో చింతల రమేశ్‌బాబు అక్కడికక్కడే మృతి చెందగా, కారు డ్రైవర్‌ బానోత్ రమేశ్‌ జనగామ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని