తనను చంపమని తానే సుపారీ ఇచ్చాడు

తాజా వార్తలు

Published : 16/06/2020 01:28 IST

తనను చంపమని తానే సుపారీ ఇచ్చాడు

దిల్లీ : అప్పులు తీర్చే మార్గం లేక ఓ వ్యక్తి తనను చంపమని తానే హంతకులకు సుపారీ ఇచ్చాడు. మరణాంతరం వచ్చే బీమా సొమ్ము కోసమే మృతుడు ఈ ప్రయత్నం చేశాడని విచారణలో వెల్లడైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దిల్లీలోని ఐపీ ఎక్స్‌టెన్షన్‌కు చెందిన కిరాణా దుకాణం యజమాని గౌరవ్‌(37) కనిపించడం లేదని ఆయన భార్య షానూ భన్సాల్‌ ఈ నెల 10న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుకాణానికి వెళ్లిన తన భర్త ఎంత సేపయినా ఇంటికి తిరగి రాలేదని ఆమె పోలీసులకు తెలిపారు. దీంతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు దిల్లీ శివారులోని రన్హౌలా ప్రాంతంలో ఓ మృతదేహం ఉన్నట్లు సమాచారం అందింది. ఆ మృతదేహం గౌరవ్‌దేనని కుటుంబ సభ్యుల ద్వారా పోలీసులు నిర్ధారించుకున్నారు. 
అనంతరం గౌరవ్‌ ఎలా చనిపోయాడనే కోణంలో పోలీసులు సమగ్రంగా దర్యాప్తు జరిపారు. ఈ క్రమంలో గౌరవ్‌ కాల్‌ రికార్డులు పరిశీలించగా తన హత్యకు తానే పథకం వేసుకొని ఓ హంతక ముఠాకు సుపారీ ఇచ్చాడని తెలిసింది. గౌరవ్‌ తన హత్య సుపారీని అప్పగించింది ఓ మైనర్‌కు కావడం మరో ఆశ్చర్యకరమైన విషయం. జూన్‌ 9న ఇంటి నుంచి ప్రజారవాణా ద్వారా బయటకు వెళ్లిన గౌరవ్‌.. చంపాల్సింది ఇతడినేనంటూ తన ఫొటోను నిందితులకు పంపించాడు. దీంతో నిందితులు గౌరవ్‌ను తాళ్లతో కట్టేసి ఓ చెట్టుకు ఉరితీసినట్లు పోలీసులు వివరించారు. ఈ హత్యకు పాల్పడిన ముఠా సభ్యులు మనోజ్‌కుమార్‌, సూరజ్‌, సుమిత్‌ కుమార్‌తోపాటు, మైనర్‌ను కూడా అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని