అనుమానాస్పదస్థితిలో భారతీయుల మృతి

తాజా వార్తలు

Updated : 24/06/2020 22:38 IST

అనుమానాస్పదస్థితిలో భారతీయుల మృతి

ప్రమాదమే కారణమా?

న్యూజెర్సీ: భారతీయ కుటుంబానికి చెందిన ముగ్గురు తమ ఇంటి ఆవరణలోని ఈతకొలనులో మృతిచెందారు. మరణించిన వారిలో భరత్‌ పటేల్‌ (62), అయన కోడలు నిషా పటేల్‌ (33)తో పాటు ఎనిమిదేళ్ల మనవరాలు కూడా ఉన్నారు. వారు అచేతనావస్థలో ఉండగా గుర్తించి కృత్రిమ శ్వాస అందించేందుకు ప్రయత్నించినప్పటికీ బతకలేదని అధికారులు వివరించారు. న్యూజెర్సీలోని ఈస్ట్‌ బ్రూన్స్‌విక్‌లో ఉన్న ఆ ఇంటిని పటేల్‌ ఇటీవలే కొనుగోలు చేసినట్టు వారు తెలిపారు.

వారికి ఈత రాకపోవడం, కొలను లోతు ఎక్కువగా ఉండటంతో ఆందోళనకు గురయ్యారా అనే కోణాలలో విచారణ సాగిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ పూల్‌ లోతు మధ్యలో ఎక్కువగానే ఉన్నప్పటికీ.. ముగ్గురూ ఎలా చనిపోయారనే విషయంపై దర్యాప్తు సాగుతోంది. కాగా, సోమవారం రాత్రి పూల్‌ ఉన్న ప్రాంతం నుంచి ఓ మహిళ అరుపులు వినిపించినట్టు స్థానికులు చెప్పారు. నిషా పటేల్‌ సహాయం కోసం కేకలు వేసి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. జరిగిన దుర్ఘటనపై ఈస్ట్‌ బ్రూన్స్‌విక్ పట్టణ మేయర్‌ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని