పాముతో కాటేయించాలని, సుపారీ ఇచ్చి చంపించాలని..

తాజా వార్తలు

Published : 25/06/2020 02:38 IST

పాముతో కాటేయించాలని, సుపారీ ఇచ్చి చంపించాలని..

67 పేజీల సూసైడ్‌ నోట్‌.. ఆసక్తికర విషయాలు

కోల్‌కతా: కట్టుకున్న భార్యను పాముతో కాటేయించాలని.. కిరాయి రౌడీలతో హత్య చేయించాలని.. కారుతో యాక్సిడెంట్‌ చేయించాలని.. ఇలా పలు పన్నాగాలు పన్నిన అమిత్‌ అగర్వాల్‌ వారెవరిని నమ్ముకోకూడదని తానే హత్య చేయాలని నిర్ణయించుకొన్నట్లు సూసైడ్‌ నోట్‌లో విస్తుపోయే విషయాలు వెల్లడించాడు. విడాకులు ఇచ్చేందుకు సిద్ధపడిన భార్యను హతమార్చేందుకు ఆరు నెలలుగా హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నాడు. తాను రాసిన 67 పేజీల సూసైడ్‌ నోట్‌కు ‘మహాభారత్‌ ఆఫ్‌ మై లైఫ్‌’ అని పేరు కూడా పెట్టాడు. కోల్‌కతా పోలీసుల వివరాల ప్రకారం.. బెంగళూరుకు చెందిన చార్టెడ్‌ అకౌంటెంట్‌ అమిత్‌ అగర్వాల్‌ (42) తన భార్య శిల్పిని ఆదివారం హత్య చేశాడు. పదేళ్ల కుమారుడితో కలిసి సోమవారం విమానంలో కోల్‌కతాకు వెళ్లాడు. విమానాశ్రయానికి మిత్రుడిని రప్పించుకొని కుమారుడిని అక్కడితన అన్నయ్య ఇంట్లో అప్పజెప్పాల్సిందిగా కోరాడు. సాయంత్రం పట్టణంలోని అత్తామామల ఇంటికి వెళ్లి వారితో గొడవపడి అత్త లలితా దండానియా(65)ను తుపాకితో కాల్చాడు. మామ సుభాష్‌ దండానియా (70) ఎలాగోలా తప్పించుకున్నట్లు కోల్‌కతా పోలీసు డిటెక్టివ్ విభాగం సీనియర్ అధికారి పేర్కొన్నారు. 

అధికారి మరిన్ని విషయాలు వెల్లడిస్తూ.. గత రెండేళ్లుగా భార్యాభర్తలు విడిగా ఉంటున్నారు. వారి మధ్య విడాకులకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కిరాయి గుండాలతో భార్యను పంపించేందుకు అగర్వాల్‌ లాక్‌డౌన్‌కు ముందు బిహార్‌కు వెళ్లాడు. పాముతో కాటేయించాలనే ఉద్దేశంతో తమిళనాడుకు వెళ్లొచ్చాడు. కారుతో యాక్సిడెంట్‌ చేయించి చంపించాలని కూడా అనుకున్నాడు. కానీ వారెవరిని నమ్ముకోకూడదనుకొని తానే హత్య చేసేందుకు సిద్ధమైనట్లు మరణ వాంగ్మూలంలో పేర్కొన్నాడని అధికారి తెలిపారు.

కోల్‌కతాలో అగర్వాల్‌కి ఓ ఫ్లాట్‌ ఉందని గతంలో ఇక్కడికి వచ్చినప్పుడే తుపాకిని కొనుగోలు చేసి ఉంటాడని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. అగర్వాల్‌ తన భార్య బంధువులందరిని హత్య చేసేందుకే నిర్ణయించుకొనే కోల్‌కతాకు వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గురుగ్రామ్‌లో ఉన్న తన బావమరిది వినీత్‌ను కూడా కోల్‌కతాకు రావాల్సిందిగా కోరాడు. కానీ అతడు రాలేకపోయాడు. బెంగళూరులో శిల్పి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అగర్వాల్ ఆమెను గొంతుకోసి హత్య చేసినట్లుగా బెంగళూరు పోలీసులు భావిస్తున్నారు. ఫ్లాట్‌లో వారి మధ్య పెనుగులాట జరిగినట్లు గుర్తించారు. అగర్వాల్‌ కుమారుడిని అపార్టమెంట్‌లోని గెస్ట్‌ హౌస్‌లో ఉంచి, తరువాత భార్య ఫ్లాట్‌కు వెళ్లి ఆమెను హత్య చేసి ఉంటాడని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు పోలీసులు వెల్లడించారు. హత్య చేసి నిందితుడు రాత్రంతా గెస్ట్‌ రూమ్‌లోనే ఉండి ఉదయం కోల్‌కతా వెళ్లినట్లు పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని