close

తాజా వార్తలు

Published : 14/08/2020 09:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

యువతిని వివస్త్రని చేసి వికృత చేష్టలు

కాపాడిన గొర్రెల కాపరి

నెల్లూరు: కొందరు యువకులు మృగాలుగా మారి ఓ యువతి పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. వివస్త్రని చేసి ..దుస్తులు ఇవ్వకుండా వికృత చేష్టలకు పాల్పడ్డారు. ఈ అమానుష ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురం జనార్దన్‌రెడ్డి కాలనీలో బుధవారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మహమూర్‌ మసీదు వెనక గొర్రెల మండీ ఉంది. దీని పక్కన నిర్మానుష్యంగా ఉండటంతో చీకటి కార్యకలాపాలకు వేదికగా మారింది. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఓ గొర్రెల కాపరి అటువైపు వెళుతుండగా ఓ ఆటో నిలిపి ఉంది. ఆ ప్రాంతంలో ఎందుకుందో అనుకుంటూ..అనుమానం వచ్చి చూడగా ఆరుగురు యువకులు కలసి ఒక యువతిని వివస్త్రను చేసి దుస్తులు ఇవ్వకుండా అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. దీంతో ఆయన తన దగ్గరున్న టార్చ్‌లైటు వేయడంతో వారు ఆటోలో అక్కడి నుంచి పరారయ్యారు. ఆటో వెనుక ఓ సినిమా నటుడి స్టిక్కర్‌ ఉన్నట్లు గుర్తించారు. గొర్రెల కాపరి యువతికి దుస్తులు ఇవ్వడంతో ఆమె అక్కడ నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనపై నవాబుపేట సీఐ వేమారెడ్డిని వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని అన్నారు. ఆ ఘటనపై విచారణ నిర్వహిస్తామని పేర్కొన్నారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.