close

తాజా వార్తలు

Published : 21/09/2020 08:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆదరిస్తాడనుకుంటే.. అంతం చేశాడు

అదృశ్యమైన బాలుని హత్య

● నిందితుడు సమీప బంధువు

గొరిజవోలు (నాదెండ్ల) : ఏడాది క్రితం కుటుంబ పెద్ద మరణించాడు. దీర్ఘకాలిక రోగాన్ని భరిస్తున్న ఆ తల్లికి తన ఇద్దరి బిడ్డల పోషణ కష్టమైంది. ఏ దిక్కూ లేని తనను ఆదరిస్తాడని మేనమామ కుమారుడు (బావ) వంచన చేరింది. అయితే 17న అదృశ్యమైన బాలుడు మూడ్రోజులకు విగతజీవిగా తేలాడు. అభం శుభం తెలియని చిన్నారిని కనికరం లేకుండా ఎవరో మట్టుబెట్టారు. గ్రామస్థులు అనుకున్నట్లే గోనెసంచిలో మూట కట్టి వాగులో పడేశారు. బాలుడు అదృశ్యమైన మరుసటి రోజు నుంచి సమీప బంధువు కనిపించకపోవడం.. అంతకు ముందు అతని ప్రవర్తన చూసి ఈ దారుణానికి అతనే పాల్పడ్డాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

నాదెండ్ల మండలం గొరిజవోలులో 17న అదృశ్యమైన దావల యశ్వంత్‌ (8) మృతదేహం ఆదివారం లభ్యమైంది. ఒక్కగానొక్క కుమారుడు క్షేమంగా ఇంటికి చేరతాడని ఆశలు పెట్టుకున్న కన్న తల్లి లక్ష్మీకి కన్నీరే మిగిలింది. గ్రామస్థుల అనుమానమే నిజమైంది. ఊరి చివర అలుగు వాగులో ముళ్లకంపని తట్టుకుని ఆగిన గోతం మూట నుంచి బాలుని కాళ్లు బయటకు కనిపించాయి. గజ ఈతగాళ్ల సాయంతో పోలీసులు వాగులో నుంచి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహం ఉబ్బడంతో ఎటువంటి దెబ్బలు, గాయాలు గుర్తించేందుకు వీలులేక హత్య చేసిన తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సున్నితమైన అవయవాలు, ఆయువు పట్టున కొట్టడంతో ప్రాణాలు విడిచి ఉంటాడని భావిస్తున్నారు. నరసరావుపేట డీఎస్పీ వీరారెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించి, మృతదేహాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యులు, స్థానికులను విచారించారు. చిలకలూరిపేట గ్రామీణ సీఐ సుబ్బారావు, నాదెండ్ల, చిలకలూరిపేట గ్రామీణ ఎస్సైలు కేవీ.నారాయణరెడ్డి, బాలకృష్ణ, భాస్కర్‌ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు మృతదేహం వెలికి తీసేందుకు శ్రమించాయి. మృతదేహాన్ని నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు.

వీరాస్వామి కోసం గాలింపు

అనుమానితుడు అయిన బాలుని తల్లి బావ వీరాస్వామి, మరికొంతమందిపై ఆదివారం రాత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. అతని ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదు. అతను 18న ఊరిలోనే ఉన్నట్లు తెలిసింది. విషయం బయటకు పొక్కి పోలీసులకు ఫిర్యాదు వెళ్లడంతో అజ్ఞాతంలోకి వెళ్లాడు. అతను దొరికితే బాలుని హత్య సంఘటన వెనుక అసలు విషయాలు వెల్లడి అవుతాయని పోలీసులు భావిస్తున్నారు. ఆచూకీకి పోలీసు ప్రత్యేక బృందాలు గాలింపు ముమ్మరం చేశాయి.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.