close

తాజా వార్తలు

Updated : 23/09/2020 09:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బుల్లితెరకూ డ్రగ్స్‌ మరకలు?

● సీసీబీ దర్యాప్తులో కొత్తకోణం


సినీ నటి రాగిణి ద్వివొేదితో సతీష్‌ క్యాడబొమ్స్‌ (దాచినచిత్రం)

బెంగళూరు (యశ్వంతపుర) : మాదక ద్రవ్యాల కేసు విచారణను రాష్ట్ర అంతర్గత భద్రత విభాగం(ఐఎస్‌డీ) భుజానికెత్తుకుంది. ఆ విభాగం అధికారులు బుల్లితెర నటులపై దృష్టి సారించారు. తీగలాగితే డొంక కదలినట్లుగా మాదక ద్రవ్యాల వ్యవహారంలో అనేక మంది పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. ‘బ్రహ్మగంటు’ సీరియల్‌ నటి గీతా భారతి భట్‌, బుల్లితెర యాంకర్‌ అభిషేక్‌, సినీనటులు లూస్‌ మాద యోగి, రష్మితా చెంగప్ప, క్రికెటర్‌ అయ్యప్ప, బుల్లి తెర ఉద్యోగిని నిశ్చితను దర్యాప్తు అధికారులు మంగళవారం విచారించారు. వారందరికీ ముందుగా నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే అరెస్టైన సినీనటులు, మత్తు పదార్థాల సరఫరా- విక్రయదారులు ఇచ్చిన సమాచారం ఆధారంగా విచారణకు పిలిచారు. సోమవారం సాయంత్రం శాంతినగరలో ఉన్న ఆ విభాగం కార్యాలయానికి సినీ నటుడు లూస్‌ మాద యోగి హాజరయ్యారు. రెండున్నర గంటల పాటు ఆయన ఈ విచారణ ఎదుర్కొన్నారు.


లూస్‌ మాద యోగి

యోగిపై గురి..

● మత్తు పదార్థాల వినియోగం, సరఫరాదారులతో తనకు ఎలాంటి సంబంధం లేదని, 2011 నుంచి తాను విందులకు వెళ్లడం మానుకున్నట్లు యోగి స్పష్టం చేశారు. అదే విషయాన్ని ఐఎస్‌డీ అధికారులకు చెప్పినట్లు ఆయన విలేకరులకు వివరించారు. సంతోషంగా ఉన్నప్పుడు మద్యం తాగుతానని, సిగరేట్‌ అలవాటు ఉందన్నారు. మత్తుపదార్థాలను ఎన్నడూ తీసుకోలేదని చెప్పారు. 2013లో సినీ నటి రాగిణి ద్వివేదితో ఒక సినిమాలో కలిసి నటించానని, ఆపై ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. 2018లో పాస్‌ పోర్టు గడువు ముగిసిన విషయాన్ని గుర్తుచేస్తూ.. ఓ ఆటలో పాల్గొనేందుకు ఓసారి శ్రీలంకకు వెళ్లినట్లు అంగీకరించారు. మాదక ద్రవ్యాల కేసులో నా పేరు ఎందుకు ప్రస్తావించారో అర్ధం కావడం లేదన్నారు. మరోసారి విచారణకు హాజరు కావాలని అధికారులు సూచించినట్లు చెప్పారు.

● మరోవైపు.. లూస్‌ యోగి ఉంటున్న అపార్ట్‌మెంట్‌ చుట్టుపక్కల ప్రజలు గిరినగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రిళ్లు యోగి స్నేహితులు మద్యం తాగి గట్టిగా కేకలు పెడుతున్నారని తప్పుపట్టారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలోనూ యోగి మిత్రులను ఠాణాకు పిలిపించి హెచ్చరించి పంపించారు.


రష్మితా చెంగప్ప

భారతి- అభి పాత్రేంటి?

బుల్లితెర నటి గీతా భారతి భట్‌, యాంకర్‌ అభిషేక్‌ను ఐఎస్‌డీ పోలీసులు మంగళవారం నాలుగు గంటల పాటు విచారించారు. విందు, మందు పార్టీలకు హాజరయ్యారా? ఆ సందర్భాల్లో మత్తుపదార్థాలను తీసుకున్నారా? మీతో పాటు పార్టీలకు హాజరైన వారెవరు? తదితర ప్రశ్నలకు బదులిచ్చారు. వారి నుంచి కొంత సమాచారం రాబట్టినట్లు అధికారులు తెలిపారు.


అభిషేక్‌

డ్రగ్స్‌తో ఆటలా?

క్రికెటర్‌ అయ్యప్పనూ దర్యాప్తు అధికారులు విచారించి విలువైన సమాచారాన్ని సేకరించారని తెలిసింది. మరోవైపు సినీ నటి రష్మితా చెంగప్పను దాదాపు రెండు గంటల పాటు విచారించారు. పబ్‌ పార్టీలకు వెళ్లలేదని, సినిమాలు, బుల్లితెర సిరియల్‌లో నటించమే తనకు తెలుసని ఆమె చెప్పినట్లు తెలిసింది. ‘బ్రహ్మగంటు’ సీరియల్‌ నటి గీతా భారతి భట్‌ను ఓ కార్యక్రమంలో కలిశానని, అభిషేక్‌తో ఒక ప్రాజెక్టులో కలిసి పని చేసినట్లు ఆమె వివరించింది. చరవాణి పోలీసులు స్వాధీనం చేసుకోలేదని, అందులో ఉన్న కొంత సమాచారాన్ని సేకరించుకుని ఇచ్చేశారని ఆమె విలేకరులకు వివరించింది.

మరికొందరికి నోటీసులు

కొందరు సినీ నటులు, బుల్లితెర నటులకు నోటీసులు ఇచ్చి విచారిస్తున్నామని దర్యాప్తు అధికారులు తెలిపారు. కొందరు రాజకీయ నాయకుల కుటుంబాల వారికీ నోటీసులు ఇస్తామని వెల్లడించారు. నగరంలోని ఓ ప్రముఖ నేత కుమార్తె, మాజీ ఎంపీ కుమారుడికీ నోటీసులు ఇచ్చే అవకాశాలున్నాయని సమాచారం.

● సినీ తారలు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీలతో సన్నిహితంగా మెలిగినట్లు అనుమానిస్తున్న పారిశ్రామికవేత్త సతీష్‌ క్యాడబొమ్స్‌ మంగళవారం బెంగళూరు కేంద్ర నేర నియంత్రణ దళం (సీసీబీ) అధికారుల విచారణకు హాజరయ్యారు. విందు- మందు పార్టీలకు ఆయన ఎక్కువగా హాజరవుతున్నట్లు గుర్తించారు. మాదక ద్రవ్యాల కేసులో జైలుకు వెళ్లిన వ్యక్తులతో ఆయన నిత్యం సంబంధాలు కొనసాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించి ఆ దిశగా ప్రశ్నల వర్షం కురిపించారని తెలిసింది.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.