close

తాజా వార్తలు

Updated : 30/09/2020 17:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రూ.166 కోట్ల దారి మళ్లింపు

చదలవాడ ఇన్ఫ్రాటెక్‌పై సీబీఐ కేసు నమోదు

 హైదరాబాద్‌: బ్యాంకు కల్పించిన క్రెడిట్‌ లిమిట్‌ను దుర్వినియోగం చేసి రూ.166.93 కోట్లు దారి మళ్లించిన ఉదంతంలో హైదరాబాద్‌కు చెందిన చదలవాడ ఇన్ఫ్రాటెక్‌ లిమిటెడ్‌ (సి.ఐ.టి.ఎల్‌.) సంస్థతో పాటు దాని సంచాలకులపైనా హైదరాబాద్‌ సీబీఐ విభాగం సోమవారం కేసు నమోదు చేసింది. ఈ ఏడాది మార్చి 13న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ) డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ దేబాశిష్‌  భట్టాఛార్జి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు నిర్వహించిన సీబీఐ అధికారులు ఇప్పుడు కేసు నమోదు చేశారు. సి.ఐ.టి.ఎల్‌. మేనేజింగ్‌ డైరెక్టర్‌ చదలవాడ రవీంద్రబాబు, సహ వ్యవస్థాపకుడు చదలవాడ వెంకట సుబ్బారావులు నాచారం పారిశ్రామికవాడలోని ఎస్బీఐలో రూ.281.23 కోట్లకు క్రెడిట్‌ లిమిట్‌ పొందారు. (వెంకట సుబ్బారావు తర్వాత చనిపోయారు.) పలు రాష్ట్రాల్లో విద్యుదీకరణ తదితర పనుల పేరుతో బ్యాంకు నుంచి ఈ సదుపాయం పొందారు. ఈ సంస్థ ఖాతాలను ఎస్బీఐ 2012 సెప్టెంబరు 22న నిరర్ధక ఆస్తుల జాబితాలో చేర్చింది. అయినప్పటికీ ఈ సంస్థ 2014 ఏప్రిల్‌ 17న ఒకసారి, 2015  డిసెంబరు 11న మరోసారి అంతకు ముందే ఇచ్చిన క్రెడిట్‌ సదుపాయం ద్వారానే చెల్లింపుల కోసం అనుమతి కోరి, బ్యాంకు నుంచి ఆమోదం పొందింది. తద్వారా  నిధులు మళ్లింపునకు పాల్పడింది. సంస్థ కార్యకలాపాలపై అనుమానం వచ్చిన బ్యాంకు అధికారులు సి.ఐ.టి.ఎల్‌.కు చార్టర్డ్‌ అకౌంటెంట్‌గా వ్యవహరించిన రాజు, ప్రసాద్‌ల సంస్థలపై దాడులు నిర్వహించి, స్వాధీనం చేసుకున్న దస్త్రాలకు ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహించింది. సి.ఐ.టి.ఎల్‌. తరఫున అందులోని సంచాలకులు, వాటాదారులు, ఉద్యోగులు, సబ్‌కాంట్రాక్టర్లు, సోదర సంస్థలకు పెద్దఎత్తున చెల్లింపులు జరిగినట్లు తేలింది.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
    ఎక్కువ మంది చదివినవి (Most Read)
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.