
తాజా వార్తలు
జిరాక్స్ నోట్లు రూ.7.90 కోట్లు!
ఒక్క మడత కూడా పడని కట్టల కొద్దీ నగదు గుట్టగా పేర్చారు ఏంటా..? అని చూస్తున్నారా! ఇవన్నీ నకిలీ నోట్లు. ఒడిశాలోని కొరాపుట్ జిల్లా పొట్టంగి పోలీసులు సోమవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా-ఆంధ్ర సరిహద్దు గ్రామమైన సుంకిలో ఓ కారును తనిఖీ చేసి వీటిని గుర్తించారు. ముగ్గురిని అదుపులోకి తీసుకొన్నారు. నోట్లను ఠాణాకు తీసుకొచ్చి లెక్కిస్తే.. మొత్తం 1580 కట్టల రూ.500 నకిలీ నోట్లు రూ.7.90 కోట్లు ఉన్నట్లు తేల్చారు. రాయపూర్‌లో కలర్ జిరాక్స్ తీసి విశాఖపట్నం తరలిస్తున్నట్లు నిందితులు అంగీకరించారని సునాబెడ ఎస్డీపీఓ కార్యాలయంలో ఎస్పీ వరుణ్ గుంటపల్లి వెల్లడించారు. నిందితుల నుంచి రూ.35 వేల నగదు, క్రెడిట్, డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకొని, మంగళవారం కోర్టులో హాజరుపర్చారు. దొంగ నోట్ల వ్యవహారం వెనుక ఒక ముఠానే ఉందని ఎస్పీ తెలిపారు.
- న్యూస్‌టుడే, సిమిలిగుడ
Tags :
జిల్లా వార్తలు
చిత్ర వార్తలు
సినిమా
- మెహ్రీన్ లవ్ ప్రపోజ్.. నజ్రియా దాగుడుమూతలు
- అలాంటి చిత్రాల్లో ‘వకీల్‌సాబ్’ ఒకటి: చరణ్
- ‘వకీల్ సాబ్’కు మహేశ్‌బాబు ప్రశంసలు
- ధావన్ ధనాధన్.. పృథ్వీ ‘షో’
- ఓటీటీలో ‘చావు కబురు చల్లగా’
- కంగనపై తాప్సీ ప్రశంసలు.. స్పందించిన ‘తలైవి’
- ప్రేక్షకులు ముందుకు రావాల్సిన సమయం
- ఐఎంఎస్ కుంభకోణంలో నాయిని అల్లుడు!
- కాబోయే కోడలు.. తన కూతురే అని తెలిస్తే
- అనుమానాస్పదస్థితిలో తండ్రి, కుమార్తె మృతి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
