close

తాజా వార్తలు

Updated : 03/03/2021 08:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అసలు ఏం జరిగింది?


ఘటన స్థలంలో పోలీస్‌ జాగిలం పరిశీలన

విజయనగరం నేరవార్తా విభాగం, గుర్ల, న్యూస్‌టుడే: సంచలనం సృష్టించిన డిగ్రీ విద్యార్థినిని తాళ్లతో కట్టేసిన కేసు కొలిక్కి రాలేదు. ప్రస్తుతం ఘోష ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె మాట్లాడటానికి ఇష్టపడటం లేదు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని సోమవారం తెల్లవారుజామున గుర్ల పోలీస్‌స్టేషన్‌ సమీపంలోని పొదల్లో అచేతన స్థితిలో పడిఉన్న సంగతి తెలిసిందే. సోమవారం రాత్రి సుమారు 3 గంటల పాటు పోలీసు ఉన్నతాధికారిణి విచారించారు. ఆ అమ్మాయితో చనువుగా ఉండే మరో ముగ్గురు అబ్బాయిలను ప్రశ్నించారు. వారి నుంచి సమాచారం ఏమీ రాలేదు. ఆ అమ్మాయికి చరవాణి అవసరమైనప్పుడు ఇచ్చేవారమని, మాట్లాడాక నంబరు తొలగించి ఇచ్చేదని కొందరు చెప్పినట్లు సమాచారం. బాబాయి ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి కళాశాల నుంచి శనివారం బయటకు వచ్చేసిన ఆమె అక్కడికి, సొంతూరు వెళ్లలేదు. మరి ఆ రెండు రోజులు ఎక్కడుందనేది అంతుబట్టడం లేదు. తాళ్లు, చేతులు కట్టేసి తుప్పల్లో పడేయాల్సిన అవసరం ఎవరికి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన కుటుంబ సభ్యులే తనను తాళ్లతో కట్టేశారని ఒకసారి, లేదు.. లేదు స్నేహితులని మరోసారి ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. పట్టణంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఎటు నుంచి ఎటు వైపు ఆమె వెళ్లింది..? ఎవరు తీసుకొని వెళ్లారు..? ఏ వాహనం ఎక్కింది..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అమ్మాయికి దగ్గరగా ఉండే ముగ్గురు అబ్బాయిలతో పాటు, ఎన్‌సీఎస్‌ సమీపంలో ఒక హోటల్‌కు సంబంధించిన వ్యక్తిని, ఆయన దగ్గర పనిచేసే మరో యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. విద్యార్థినిగానే మాకు తెలుసు అని..అంతకు మించి ఏమీ తెలియదని చెప్పుకొచ్చినట్లు సమాచారం. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని ఎస్పీ బి.రాజకుమారి తెలిపారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని