Cyber Crime: తక్కువ పెట్టుబడి అన్నారు.. రూ.12.91 లక్షలు కొట్టేశారు

తాజా వార్తలు

Published : 28/05/2021 07:08 IST

Cyber Crime: తక్కువ పెట్టుబడి అన్నారు.. రూ.12.91 లక్షలు కొట్టేశారు

బాలానగర్‌, న్యూస్‌టుడే: యాప్‌లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వస్తుందన్న ఆశతో ఓ మహిళ  భారీగా మోసపోయిన ఘటన బాలానగర్‌ ఠాణా పరిధిలో జరిగింది. సీఐ వహీదుద్దీన్‌ కథనం ప్రకారం.. రాజు కాలనీకి చెందిన బ్యూటీషియన్‌ సౌభాగ్యలక్ష్మి ఓ స్నేహితురాలి ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బు సంపాదించే యాప్‌ గురించి తెలుసుకుంది. ఏప్రిల్‌లో లైటింగ్‌ పవర్‌ బ్యాంక్‌ యాప్‌ ద్వారా కొంత డబ్బు పెట్టుబడి పెట్టింది. వెంటనే ఓ వ్యక్తి ఫోన్‌చేసి  మీరు పెట్టిన పెట్టుబడికి ఎక్కువ డబ్బు వస్తుందని చెప్పాడు. కొన్ని రోజులకు తన బ్యాంకు ఖాతాలో  తన పెట్టుబడికి అదనంగా మరికొంత జమ అయ్యింది. తరువాత ఆ వ్యక్తి ఆమెకు ఫోన్‌ చేశాడు. అతను చెప్పినట్లుగా తన వద్ద ఉన్న డబ్బుతోపాటు తన కుటుంబ సభ్యులు, బంధువుల డబ్బు రూ.12,91,025  మొత్తాన్ని ఆ వ్యక్తి ఇచ్చిన ఖాతాలో జమ చేసింది. ఎన్ని రోజులైనా అదనంగా డబ్బు  రాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించి గురువారం ఆమె పోలీసులను ఆశ్రయించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని