Cyber Crime: గాలానికి చిక్కితే గల్లంతే!

తాజా వార్తలు

Updated : 09/06/2021 07:53 IST

Cyber Crime: గాలానికి చిక్కితే గల్లంతే!

 ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరుతో సరికొత్త మోసాలు

భారీగా లాభాలంటూ బోగస్‌ సంస్థల ప్రకటనలు

ఈనాడు, హైదరాబాద్‌

తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అర్జించాలన్న అత్యాశతో కేవలం మూడో వ్యక్తి(థర్డ్‌పార్టీ) మాటలు నమ్మి నట్టేట మునుగుతున్నారు. ఇలా మోసాలకు గురవుతున్న వారిలో 18-42 సంవత్సరాల మధ్య వయస్కులే అధికంగా ఉంటున్నారని సైబర్‌ నిపుణులు విశ్లేషిస్తున్నారు. గ్రేటర్‌ పరిధిలోని మూడు పోలీసు కమిషనరేట్స్‌ పరిధిలో ఈ తరహా ఫిర్యాదులు ప్రతి నెలా 10-12 వరకూ వస్తున్నాయని అంచనా.

లాభమనుకుంటే.. గూబగుయ్‌

‘తేలికగా సంపాదించటమెలా’ అంటూ అంతర్జాలం, యూట్యూబ్‌లలో క్లిక్‌ చేస్తే లక్షలాది మార్గాలు ప్రత్యక్షమవుతాయి. వాటిలో ఆకట్టుకునే డిజైన్లలో కనిపించే ప్రకటనలకు ఆకర్షితులవుతున్నారు. కరోనా వేళ ఉపాధి దూరమయి.. ఆశ, అవసరం రెండూ మంచిచెడులను ఆలోచించే విచక్షణను దూరం చేస్తున్నాయంటున్నారు ఐటీరంగ నిపుణులు, విశ్లేషకులు శ్రీధర్‌ నల్లమోతు. ఆకట్టుకునేందుకు ఆన్‌లైన్‌గేమింగ్‌, కలర్‌ ప్రిడిక్షన్‌, ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌, రమ్మీ, ఆన్‌లైన్‌ లాటరీ, అప్లికేషన్స్‌, లింక్స్‌ తదితర పేర్లతో బోగస్‌ కంపెనీలు వల విసురుతున్నాయి. చైనా కేంద్రంగా బోగస్‌ కంపెనీలు రుణయాప్‌లతో గాలమేశాయి. అక్కడ పోలీసులు కేసులంటూ తలనొప్పులు మొదలవటంతో ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరుతో మోసాలకు తెగబడుతున్నాయని హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్‌ తెలిపారు.

లింక్‌లతో ట్రేడింగ్‌.. జరభద్రం

- ఎస్‌.హరినాథ్‌, ఏసీపీ, రాచకొండ సైబర్‌క్రైమ్‌

నకిలీ సంస్థలు, సైబర్‌నేరగాళ్లు చెలరేగుతున్నారు. కొన్ని విదేశీ సంస్థలు ఇక్కడి వారిని బినామీలుగా ఎంచుకుంటున్నాయి. వాట్సాప్‌ గ్రూపు లింక్‌ల ద్వారా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. మొదట పెట్టుబడికి రాబడి వస్తుండటంతో పొదుపుచేసిన సొమ్మును కూడా ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌లో ఉంచుతున్నారు. నిండా మునిగాక పోలీసులను ఆశ్రయిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని