TS News: నకిలీ చలా‘మనీ’!
close

తాజా వార్తలు

Updated : 19/06/2021 11:17 IST

TS News: నకిలీ చలా‘మనీ’!

స్వాధీనం చేసుకున్న నోట్లు, నిందితుడు రాజు

కేపీహెచ్‌బీకాలనీ, న్యూస్‌టుడే: అయిదుసార్లు జైలుకి వెళ్లొచ్చినా అతని బుద్ధి మారలేదు. తాజాగా ఆరోసారి కూడా జైలుకి వెళ్లాడు మెదక్‌ జిల్లా అల్లాదుర్గ్‌కు చెందిన 28 ఏళ్ల ఉప్పరి రాజుప్రసాద్‌. కేసు వివరాలను శుక్రవారం కేపీహెచ్‌బీ ఠాణాలో మాదాపూర్‌ జోన్‌ డీసీపీ వేంకటేశ్వర్లు, ఏసీపీ సురేందర్‌రావు వెల్లడించారు. రాజుప్రసాద్‌ ఐటీఐ చేసి పటాన్‌చెరులో ప్రింటింగ్‌ ప్రెస్‌ నడిపించాడు. ఈ సమయంలో కలర్‌ జిరాక్స్‌ తీసిన దొంగనోట్లను చలామణి చేశాడు. ఆ తర్వాత అదే బాట పట్టాడు. 2017లో పటాన్‌చెరులో దొంగనోట్లు మార్చుతుండగా పోలీసులకు పట్టుబడి సంగారెడ్డి జైలుకి వెళ్లాడు. అక్కడ ఏలూరు టౌన్‌కు చెందిన యువకుడు పరిచయమయ్యాడు. దొంగనోట్లు తయారు చేసి తీసుకొస్తే ఏలూరులో బంగారం కొనుగోలు చేయవచ్చని రాజుప్రసాద్‌కు చెప్పాడు. 2018లో ఇక్కడ దొంగనోట్లు తయారు చేసి అక్కడ బంగారు కోనుగోలు చేసే క్రమంలో ఇద్దరిని పోలీసులు పట్టుకుని జైలుకి పంపించారు. బయటకొచ్చినా రాజుప్రసాద్‌ తన నేరాలను మాత్రం ఆపలేదు. అదే ఏడాది కృష్ణాజిల్లా మండవల్లిలో, 2019లో సంగారెడ్డిలో, 2021లో బాచుపల్లిలో దొంగనోట్లు మారుస్తూ మళ్లీ పోలీసులకు దొరికాడు. ఈనెల 17న సాయంత్రం కేపీహెచ్‌బీ తొమ్మిదోఫేజ్‌లో దొంగనోట్లు మారుస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం తెలుసుకున్న సీఐ లక్ష్మీనారాయణ, ఎస్సై శ్యాంబాబు వెళ్లి రాజుప్రసాద్‌ను అరెస్టు చేశారు. ఘటనకు ముందు మెదక్‌ జిల్లా ఇస్నాపూర్‌లో దొంగనోటుతోచెప్పులు కొన్నాడు. నిందితుడు నుంచి పోలీసులు 14 రూ.2 వేల దొంగనోట్లు, ప్రింటర్‌ కమ్‌ స్కానర్‌ను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని