Crime News: పొట్టలో రూ.10 కోట్ల విలువైన కొకైన్‌

తాజా వార్తలు

Updated : 11/08/2021 12:04 IST

Crime News: పొట్టలో రూ.10 కోట్ల విలువైన కొకైన్‌

ముంబయి: తూర్పు ఆఫ్రికాలోని మొజాంబిక్‌ దేశానికి చెందిన ఓ వ్యక్తి ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుబడ్డాడు. రూ.10 కోట్ల విలువ చేసే 1.02 కేజీల కొకైన్‌ ఇతని వద్ద పట్టుబడింది. నిందితుడు ఫ్యూమో ఇమాన్యుయేల్‌ జెడెక్వియాస్‌ ఈ మత్తు పదార్థాన్ని క్యాప్సూల్స్‌ రూపంలో పొట్టలో దాచుకొన్నట్టు మాదకద్రవ్యాల నిరోధక విభాగం మంగళవారం తెలిపింది.  కొకైన్‌తో నింపిన 70 క్యాప్సూళ్లను ఇతడు మింగినట్లు విచారణలో తెలిసింది. వెంటనే అతణ్ని బైకుల్లాలోని జేజే ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు పదిమార్లు ప్రయత్నించి కొకైన్‌ క్యాప్సూళ్లను వెలికితీశారు. అది దక్షిణ అమెరికాకు చెందిన కొకైన్‌గా గుర్తించినట్లు అధికారులు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని