HYD: చైనీయులు కొల్లగొట్టిన సొమ్ము ఇక కష్టమే

తాజా వార్తలు

Published : 20/08/2021 10:15 IST

HYD: చైనీయులు కొల్లగొట్టిన సొమ్ము ఇక కష్టమే

విదేశీ ఖాతాల్లో జమ కావడమే కారణం

ఈనాడు, హైదరాబాద్‌: రుణయాప్‌లు, ఆన్‌లైన్‌ ఆటల పేరుతో చైనీయులు కొల్లగొట్టిన సొమ్ము తిరిగి రాబట్టడం దర్యాప్తు సంస్థలకు సవాలుగా మారింది. ఇప్పటికే డబ్బు చాలా వరకూ విదేశీఖాతాల్లోకి మళ్ళిపోయింది. దీంతో అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించారు. ఆన్‌లైన్లో దరఖాస్తు చేస్తే చాలు..రుణమిస్తామంటూ యాప్‌ల మాటున దేశవ్యాప్తంగా భారీ దోపిడీకి తెరతీసిన సంగతి తెలిసిందే. అడ్డగోలుగా వడ్డీ వసూళ్లు, వేధింపుల కారణంగా బాధితుల్లో కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ఘటనలపై రాష్ట్రవ్యాప్తంగా 50కి పైగా కేసులు నమోదయ్యాయి. ఈ యాప్‌ల మాటున చైనీయులు ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్‌ పోలీసులు జువీ అనే చైనీయుడిని అరెస్టు చేసినప్పుడు హైదరాబాద్, గుర్గావ్, బెంగళూరు కాల్‌సెంటర్ల ద్వారా దాదాపు రూ.20వేల కోట్ల వ్యాపారం చేసినట్లు,  సింహభాగం విదేశాలకు తరలించినట్లు వెల్లడయింది.

ఇదికాక ఆన్‌లైన్‌ ఆటల పేరుతోనూ చైనీయులు భారీగా దోచుకున్నారు. కలర్‌ ప్రిడిక్షన్‌ పేరుతో సాగిన ఆటలోనే రూ.వందలకోట్ల లావాదేవీలు జరిగినట్లు తేలింది. 354 రుణయాప్‌ల ద్వారా ఏడు నెలల్లో రూ.16వేల కోట్లు కొల్లగొట్టినట్లు పోలీసులు గుర్తించారు.  స్థానిక పోలీసులు దీనిపై కేసులు పెట్టి నిందితులను అరెస్టు చేసినా ఇదంతా అక్రమ మార్గంలో డబ్బు మళ్ళింపు కిందికే వస్తుంది. డబ్బు మళ్ళించడం పీఎంఎల్‌ఏ చట్టం పరిధిలోకి వస్తుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) కూడా దీనిపై మరో కేసు నమోదు చేసింది. హైదరాబాద్‌ పోలీసులు అతికష్టం మీద రూ.400 కోట్లు మాత్రమే జప్తు చేయగలిగారు. మిగతా నిధులన్నీ దాదాపుగా విదేశీ ఖాతాల్లో జమకావడంతో జప్తుచేయడం సవాలుగా మారింది. విదేశీ ఖాతాల్లోకి మళ్ళిన డబ్బు వెనక్కు రావడమనేది సులభసాధ్యమేమీ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని