వైకాపా నాయకుడి వేధింపులే కారణమంటూ..

తాజా వార్తలు

Updated : 01/07/2021 09:02 IST

వైకాపా నాయకుడి వేధింపులే కారణమంటూ..

రాయవరం, న్యూస్‌టుడే: తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం నదురుబాదకు చెందిన ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ క్షేత్ర సహాయకుడు విత్తనాల ముత్యాలరావు (ముత్తు) బుధవారం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని బంధువులు హుటాహుటిన రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

దళితుడిగా పుట్టడమే నేరమా?

గ్రామంలోని మాజీ ఎంపీపీ, వైకాపా జిల్లా ప్రచార కమిటీ సమన్వయకర్త సిరిపురపు శ్రీనివాసరావు వేధింపులే తన ఆత్మహత్యకు కారణమని ముత్యాలరావు సెల్పీ వీడియోలో వాపోయారు. దళితుడిగా పుట్టడమే నేరమా? మమ్మల్ని మానసికంగా వేధిస్తారా! అంటూ అందులో ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉపాధి పనుల్లో ముత్యాలరావు కూలీల హాజరు సక్రమంగా వేయడం లేదని, అక్రమాలకు పాల్పడుతున్నాడని గ్రామానికి చెందిన తొమ్మిది మంది రాయవరం ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు ఈవోపీఆర్డీ, వెలుగు ఏపీఎం, టెక్నికల్‌ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శి గ్రామంలో మంగళ, బుధవారాల్లో 51 మందిని విచారించారు. దీనిపై ఈవోపీఆర్డీ అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ విచారణ పూర్తయిందని, నివేదికను ఎంపీడీవోకు ఇవ్వాల్సి ఉందని ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని