TS News: అందీ అందని ఆశయం.. ఐఏఎస్‌ కాలేక విరక్తితో ఆత్మహత్య

తాజా వార్తలు

Updated : 25/08/2021 06:43 IST

TS News: అందీ అందని ఆశయం.. ఐఏఎస్‌ కాలేక విరక్తితో ఆత్మహత్య

నిజామాబాద్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: ఐఏఎస్‌ కావాలన్నది అతని జీవితాశయం. వయసు పెరిగిపోతుండటం..లక్ష్యం అందినట్టే అంది దూరమవుతుండటంతో జీవితంపై ఆశ చంపేసుకున్నాడు. చివరికి బలవన్మరణానికి పాల్పడ్డాడు. నిజామాబాద్‌లోని వివేకానందనగర్‌ కాలనీ వాసి శ్రీనివాస్‌(42) పీహెచ్‌డీ పూర్తి చేశాడు. ఐఏఎస్‌ కావాలనే ఆశయంతో ఏళ్ల తరబడి దిల్లీలో ఉండి శిక్షణ తీసుకున్నాడు. రెండుసార్లు ముఖాముఖి వరకు వెళ్లినా ఫలితం లేకపోయింది. ఇటీవల బంధువుల్లో ఒకరికి ఐఏఎస్‌ రావడంతో..మరింత కుంగిపోయాడు. ఇదే కారణంతో గతంలో ఒకసారి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. కుటుంబ సభ్యులు సకాలంలో గుర్తించడంతో బతికి బయటపడ్డాడు. మంగళవారం ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిజామాబాద్‌ నాలుగో ఠాణా పోలీసులు కేసు నమోదు చేశారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని