Crime News: చదువుకోమని చెప్పినందుకు.. కరాటే బెల్ట్‌తో తల్లిని చంపేసింది

తాజా వార్తలు

Updated : 11/08/2021 06:07 IST

Crime News: చదువుకోమని చెప్పినందుకు.. కరాటే బెల్ట్‌తో తల్లిని చంపేసింది

 ముంబయిలో దారుణ ఘటన

ముంబయి: టీనేజీకి వచ్చాక.. కెరీర్‌ మీద దృష్టిపెట్టమని తల్లితండ్రులు పిల్లలకు చెప్పడం సహజమే. కానీ.. ఇలా చెప్పడమే ఆ తల్లిపాలిట శాపమైంది. సొంత కూతురే ఆమె పాలిట హంతకురాలిగా మారింది. కరాటే బెల్ట్‌ తీసుకొని తల్లి గొంతు నులిమి అతి కిరాతకంగా చంపింది. ఆపై ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు చిత్రీకరించడానికి చూసింది. వివరాల్లోకి వెళ్తే.. నవీ ముంబయిలో ఏరోలీ ప్రాంతంలో నివాసముంటున్న ఓ మహిళ(40)కి తన కూతురు(15) మెడిసిన్‌ కోర్స్‌ చదవాలని కోరిక. ఇదే విషయంపై ఇద్దరికి తరచూ గొడవులు జరుగుతుండేవి. గతనెల తీవ్రమైన ఘర్షణ జరగ్గా.. తన తల్లి వేధిస్తోందంటూ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసి వచ్చింది. దీంతో ఆ కుటుంబం మొత్తానికి పోలీసులు కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపించారు. అయినప్పటికీ ప్రవర్తనలో మార్పు రాని కూతురు.. చదువుకోమని తల్లి ఒత్తిడి తీసుకొస్తుందని కరాటే బెల్ట్‌తో గొంతు నులిమి చంపేసింది. కేసు నమోదు చేసుకున్న రబాలే పోలీస్‌ స్టేషన్‌ పోలీసులు.. కూతురిని విచారించగా.. మొదట ప్రమాదవశాత్తుగా తల్లి చనిపోయిందని నమ్మబలికింది. ఆపై శవపరీక్ష చేశాక.. అది ప్రమాదవశాత్తు జరిగింది కాదని తేలింది. పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. కూతురు నేరాన్ని అంగీకరించింది. జులై 30నే ఈ ఘటన చోటుచేసుకోగా.. సోమవారం ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.

ఇవీ చదవండి


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని