పంచలింగాల వద్ద భారీగా బంగారం పట్టివేత

తాజా వార్తలు

Updated : 25/06/2021 11:44 IST

పంచలింగాల వద్ద భారీగా బంగారం పట్టివేత

కర్నూలు నేరవిభాగం: కర్నూలు జిల్లా పంచలింగాల సమీపంలోని ఏపీ-తెలంగాణ అంతర్రాష్ట్ర సరిహద్దు తనిఖీ కేంద్రం వద్ద గురువారం తెల్లవారుజామున భారీగా బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సును తెల్లవారుజామున రెండు గంటల సమయంలో కర్నూలు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పోలీసులు ఆపి తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ప్రయాణికుల్లో ఒకరైన బెంగళూరులోని శివాజీనగర్‌కు చెందిన మహవీర్‌ జైన్‌ వద్ద ఐదు కేజీల బంగారు ఆభరణాలు గుర్తించారు. అందుకు సంబంధించి ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో సీజ్‌ చేసి కర్నూలు తాలూకా అర్బన్‌ పోలీస్‌ స్టేషన్‌కు అప్పగించారు. పట్టుబడిన బంగారు ఆభరణాల విలువ సుమారు రూ.2.50 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి పట్టుబడిన బంగారాన్ని ఆదాయపన్ను శాఖకు అప్పగించారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని