close

తాజా వార్తలు

Updated : 03/03/2021 15:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వామన్‌రావు దంపతుల హత్య సీన్‌ రీకన్‌స్ర్టక్షన్‌

పెద్దపల్లి: హైకోర్టు న్యాయవాదులు వామన్‌రావు, నాగమణి దంపతుల హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. విచారణలో భాగంగా అదుపులో ఉన్న నలుగురు నిందితుల్లో ముగ్గురిని పోలీసులు మంథని తీసుకెళ్లారు. హత్యకు ముందు రెక్కీ చేసిన ప్రాంతాల్లో సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌‌ నిర్వహించారు. హత్యకు ముందు నిందితులు రెక్కీ నిర్వహించిన మంథని కోర్టు ప్రాంగణం, రిజిస్ట్రేషన్‌ కార్యాలయం, అంబేడ్కర్‌ చౌక్‌లో పోలీసులు సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ నిర్వహించారు. అనంతరం నిందితులను హత్య జరిగిన కల్వచర్లకు తీసుకెళ్లారు. హత్య జరిగిన తీరును కుంట శ్రీను, కుమార్, చిరంజీవి పోలీసులకు వివరించారు.

హైకోర్టు న్యాయవాదులు వామన్‌రావు, నాగమణి దంపతులను ఈ నెల 17న పెద్దపల్లి జిల్లా కల్వచర్ల వద్ద రోడ్డుపై దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. దంపతుల హత్య కేసుకు సంబంధించి బిట్టు శ్రీనుతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని