లారీ ఢీ కొని ముగ్గురు విద్యార్థుల దుర్మరణం 

తాజా వార్తలు

Published : 13/02/2021 01:33 IST

లారీ ఢీ కొని ముగ్గురు విద్యార్థుల దుర్మరణం 

మదనపల్లె గ్రామీణం : ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ముగ్గురు బాలురు ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టి దుర్మరణం పాలైన ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం ఆరోగ్యవరం వద్ద ఈ విషాదం చోటుచేసుకుంది. మదనపల్లె పట్టణంలోని రామారావు కాలనీకి చెందిన ధనుశ్‌‌(16), రామిరెడ్డి లేఅవుట్‌కు చెందిన తరుణ్‌కుమార్‌ రెడ్డి(16),శ్రీహరి (18) కలిసి ద్విచక్ర వాహనంపై గుర్రంకొండ మండలం తరిగొండలో జరుగుతున్న ఓ వివాహానికి బయలుదేరారు. రాత్రి కావడంతో వారి వాహనం ఆరోగ్యవరం వద్దకు  వచ్చే సరికి అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. సమాచారం అందుకున్న  రూరల్‌ పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం మదనపల్లె ఆస్పత్రికి తరలించారు. కాగా, మృతి చెందిన బాలురు వేర్వేరు పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్నారు. 

ఇదీ చదవండి

విషాద యాత్రగా ముగిసిన విహార యాత్ర


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని