
తాజా వార్తలు
హనుమాన్ జంక్షన్ వద్ద లారీ బీభత్సం
బాపులపాడు: కృష్ణా జిల్లా బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ వద్ద లారీ బీభత్సం సృష్టించింది. జాతీయ రహదారిపై కారు, ద్విచక్ర వాహనాన్ని లారీ ఈడ్చుకుంటూ వెళ్లింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై ఉన్న మరో మహిళకు కాళ్లు విరిగిపోయాయి. కారులో ఇరుక్కుపోయిన నలుగురు బాధితులను పోలీసులు బయటకు తీశారు. లారీ డ్రైవర్ మద్యం తాగి వాహనాన్ని నడిపినట్లు పోలీసులు భావిస్తున్నారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలంలో చనిపోయిన వ్యక్తిని బాపులపాడు మండలం ఇందిరానగర్‌కు చెందిన మహేశ్ (35)గా పోలీసులు గుర్తించారు. పండగ సందర్భంగా హనుమాన్ జంక్షన్లో ఉన్న అత్తింటికి మహేశ్ వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇవీ చదవండి..
అఖిలప్రియ కేసులో దర్యాప్తు ముమ్మరం
వ్యాక్సినేషన్.. ఈ రూల్స్ మర్చిపోవద్దు
Tags :