కల్తీ మద్యం: 20కి చేరిన మృతుల సంఖ్య

తాజా వార్తలు

Updated : 14/01/2021 13:07 IST

కల్తీ మద్యం: 20కి చేరిన మృతుల సంఖ్య

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని మొరేనా జిల్లాలో కల్తీ మద్యం సేవించిన ఘటనలో మృతుల సంఖ్య 20కి చేరింది. ఇంకా పలువురి పరిస్థితి విషమంగానే ఉందని ప్రభుత్వాధికారులు తెలిపారు. ఈ అంశంపై ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది. ప్రాథమిక వివరాల ప్రకారం మాన్పుర్‌, పహవళి గ్రామాలకు చెందిన కొందరు వ్యక్తులు సోమవారం రాత్రి తెల్లని రంగులో ఉన్న ఓ ద్రవాన్ని సేవించారు. అనంతరం కొందరు అస్వస్థతకు గురవ్వడంతో ఆస్పత్రికి తరలించారు. ఘటన జరిగినప్పటి నుంచి మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గతేడాది అక్టోబర్‌లో కూడా ఉజ్జయినిలో ఇటువంటి ఘటనే జరగడంతో 14మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు దర్యాప్తు పూర్తైన తర్వాత వెలువడే అవకాశముంది. ఈ నేపథ్యంలో నలుగురు ప్రభుత్వాధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్ చౌహాన్‌ స్పందించారు. ‘‘ మొరేనా ఘటన చాలా బాధాకరమైనది. దీనిపై దర్యాప్తు జరుగుతోంది. నిజానిజాలు బయటపడిన తర్వాత దీని కారకులను తీవ్రంగా శిక్షిస్తాం. ఎవరినీ ఉపేక్షించబోం.’’ అని ఆయన ట్వీట్‌ చేశారు.

ఇవీ చదవండి..

అది నిజంగా చైనా టీకానే..

లోరీ మంటల్లో సాగు చట్టాల ప్రతులుTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని