close

తాజా వార్తలు

Published : 11/04/2021 02:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆన్‌లైన్‌‌లో ఉద్యోగ ప్రకటనలతో మోసం

నిందితుణ్ని అరెస్టు చేసిన దిల్లీ పోలీసులు  

దిల్లీ: దుబాయ్‌లో ఉద్యోగ అవకాశం కల్పిస్తానని ఆన్‌లైన్‌‌ ద్వారా మోసానికి పాల్పడుతున్న 48 ఏళ్ల వ్యక్తిని దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు అరవింద్‌ పరేఖ్‌ అస్సాంలోని గువాహటికి చెందినవాడుగా గుర్తించారు. విచారణలో అతడు 25 మందికి విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసినట్టు తేలింది. 

అతడు తన స్నేహితుడి సాయంతో ఈ ఆన్‌లైన్‌‌ మోసానికి పాల్పడ్డాడు. రిజిస్ట్రేషన్‌ ఫీజు, వైద్య పరీక్షలు, ఇంటర్య్వూ తదిర సాకులతో బాధితుల నుంచి డబ్బులు రాబట్టారు. బాధితుల్లో ఒకరు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం  బయట పడింది. 

దిల్లీ, చత్తర్‌పూర్‌లో ఓ మహిళ తన భాగస్వామితో కలిసి హోం ఫుడ్‌ డెలివరీ చేస్తూ జీవనం సాగిస్తోంది. ఆమె మార్చి మొదటి వారంలో విదేశాల్లో చెఫ్‌ ఉద్యోగం కోసం ఆన్‌లైన్‌లో ఒక ప్రకటన చూసి సంబంధిత వ్యక్తిని సంప్రదించింది. అతను అమెరికాలోని  రెస్టారెంట్‌లో ఉద్యోగం ఉందని నమ్మబలికాడు. అందుకోసం ఆమె దగ్గర నుంచి రూ. 36 వేలు తీసుకున్నాడు. ఆ తర్వాత ఆ మహిళ అతడిని సంప్రదించడానికి ప్రయత్నించింది. కానీ అతని ఫోన్‌ పని చేయలేదు. దాంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. 

డిప్యూటీ కమీషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (సౌత్‌) అతుల్‌ కుమార్‌ ఠాకూర్‌ మాట్లాడుతూ ‘‘ కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడి బ్యాంక్‌ ఎకౌంట్‌, బెనిఫిషరీల వివరాలను సేకరించాం. వాటి ఆధారంగా నిందితుడు అమెరికా, కెనడా తదితర దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి, బాధితుల నుంచి డబ్బు తీసుకున్నాడని రుజువైంది. ఇతర సాంకేతిక ఆధారాల సాయంతో నిందితుణ్ని ఏప్రిల్‌ 7న కోల్‌కతాలోని కస్బా ప్రాంతంలో అరెస్టు చేశాం.  నాలుగు ఏటిఎం డెబిట్‌ కార్డులు, నకిలీ ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డు, స్మార్ట్ ఫోన్‌ స్వాధీనం చేసుకున్నాం. ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది’’ అని తెలిపారు.


 


 

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని