నడిరోడ్డుపై భార్య, అత్తపై కత్తితో దాడి

తాజా వార్తలు

Updated : 17/03/2021 04:54 IST

నడిరోడ్డుపై భార్య, అత్తపై కత్తితో దాడి

చెన్నై: తమిళనాడులో ఉన్మాదిగా మారిన ఓ వ్యక్తి.. భార్య, అత్తపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో వారిద్దరు ప్రాణాలు విడిచారు. ఈ సంఘటన కడలూరు పోర్టు ప్రాంతంలో చోటుచేసుకుంది. ఓ మహిళ తన తల్లితో కలిసి రోడ్డు వెంట వెళ్తుండగా వారిని అనుసరించిన సదరు మహిళ భర్త ఒక్కసారిగా రెచ్చిపోయాడు. వెంటతెచ్చుకున్న కత్తితో అందరూ చూస్తుండగానే రోడ్డుపైనే భార్యతోపాటు, అత్తపై దాడికి పాల్పడ్డాడు. పారిపోయేందుకు ప్రయత్నించినా వెంబడించి మరీ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో వారిరువురు మృతిచెందారు. సీసీ కెమెరాలో నిక్షిప్తమైన ఈ దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని