
తాజా వార్తలు
భార్య, కుమార్తెలను సుత్తితో కొట్టి దారుణ హత్య
బులంద్‌షహర్: ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. షికార్‌పుర్ గ్రామానికి చెందిన సయీద్ అనే వ్యక్తి భార్య, ముగ్గురు కుమార్తెలపై సుత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో భార్య, ఇద్దరు కుమార్తెలు అక్కడికక్కడే మృతి చెందగా మరో కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. దాడికి పాల్పడ్డ నిందితుడికి మానసిక పరిస్థితి సరిగా లేదని పోలీసులు పేర్కొన్నారు. పరారిలో ఉన్న నిందితుడు సయీద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇవీ చదవండి
Tags :