చెన్నైలో ఘోరం: బస్టాండ్‌లోనే మహిళకు నిప్పు

తాజా వార్తలు

Published : 11/04/2021 10:30 IST

చెన్నైలో ఘోరం: బస్టాండ్‌లోనే మహిళకు నిప్పు

చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తనతో సహజీవనం చేస్తున్న మహిళ మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందని ఆగ్రహంతో ఆమెను ముత్తు అనే వ్యక్తి బస్టాండ్‌లోనే సజీవ దహనం చేశాడు. చెన్నైలో రోజువారీ కార్మికుడైన ముత్తు.. శాంతి అనే మహిళతో సహజీవనం చేస్తున్నాడు. వారిద్దరు బస్‌స్టేషన్‌లో ప్లాట్‌ఫాంపైనే జీవించేవారు. అయితే కోయంబేడు మార్కెట్‌లో పనిచేసే మరో వ్యక్తితో శాంతి సన్నిహితంగా ఉంటోంది. అది ఇష్టంలేని ముత్తు సదరు వ్యక్తితో తెగదెంపులు చేసుకోవాలని శాంతిని హెచ్చరించాడు. ఆమె వినకపోవడంతో కక్ష పెంచుకున్న ముత్తు.. శాంతి నిద్రిస్తున్న సమయంలో పెట్రోల్‌ పోసి ఆమెకు నిప్పంటించాడు. అతడు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రయాణికులు, స్థానికులు ఆ మంటలను ఆర్పేసి పోలీసులకు సమాచారమిచ్చారు. ఇరువురిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని