టన్నెల్‌ ఎఫైర్‌: ప్రియురాలి ఇంటికే సొరంగం

తాజా వార్తలు

Published : 01/01/2021 01:38 IST

టన్నెల్‌ ఎఫైర్‌: ప్రియురాలి ఇంటికే సొరంగం

మెక్సికో సిటీ: ప్రియురాలిని చాటుగా కలిసేందుకు రకరకాల ప్రయత్నాలు చేసే వాళ్ల గురించి వింటుంటాం. కానీ ఇది అంతకు మించి! పెళ్లైన ఓ వ్యక్తి తన ప్రియురాలిని తరచూ కలిసేందుకు తన ఇంటినుంచి ఆమె ఇంటి వరకు భారీ సొరంగాన్ని తవ్వి అడ్డంగా దొరికిపోయాడు. మెక్సికోలోని తిజునా పట్టణంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ఆల్బెర్టో అనే వ్యక్తి నిర్మాణ రంగంలో పనిచేస్తున్నాడు. విల్లాస్‌ డెల్‌ ప్రాడో -1లో పొరుగున ఉండే తన ప్రియురాలు పమిలాతో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. రహస్యంగా కలిసేందుకు ఆమె ఇంటికి ఏకంగా పెద్ద సొరంగాన్నే తవ్వాడు. ఆమె భర్త జార్జ్‌ విధుల్లోకి వెళ్లిన సందర్భంలో ఈ సొరంగం తవ్వినట్టు భావిస్తున్నారు. అయితే, అతడు విధులకు వెళ్లగానే సొరంగం ద్వారా ఇంట్లోకి ప్రవేశించి రహస్యంగా కలుస్తుండేవాడు. 

ఈ క్రమంలోనే ఓ రోజు జార్జ్‌ విధులు త్వరగా ముగించుకొని ఇంటికి వచ్చాడు. ఏదో అనుమానం వచ్చి బెడ్‌రూమ్‌లో మంచం కింద చూడగా అక్కడ ఎవరూ కనబడలేదు. ఆ తర్వాత సోఫా కదలడాన్ని చూసి షాక్‌ అయిన జార్జ్‌.. దాని వెనుక ఉన్న ఆల్బెర్టోను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో వీరిద్దరి బండారం బయటపడింది. అలాగే, తన ఇంటి ఫ్లోర్‌పై ఉన్న రంధ్రాన్ని చూసి.. దాన్ని పరిశీలించగా అదో పెద్ద సొరంగమని, ఆల్బెర్ట్‌ ఇంటిదాకా ఉన్నట్టు తెలిసి కంగుతిన్నాడు. ఇదిలా ఉండగా.. సొరంగ మార్గాన్ని అనుసరిస్తూ తన ఇంటికి వచ్చిన జార్జ్‌ను ఈ ఎఫైర్‌ గురించి తన భార్యకు చెప్పొద్దని, అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ అల్బెర్టో వాదనకు దిగాడు. దీంతో వారిద్దరి మధ్య ఘర్షణ తలెత్తడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఈ సీక్రెట్‌ టన్నెల్‌కు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

ఇవీ చదవండి..

తెలంగాణలో నేరాలు..ఘోరాలు@ 2020

చుక్కేసి నడిపారు.... ప్రాణాలు తీశారు

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని