TS News: కోహిర్‌ మండలం దిగ్వాల్‌ వద్ద కారు దగ్ధం

తాజా వార్తలు

Updated : 13/08/2021 04:41 IST

TS News: కోహిర్‌ మండలం దిగ్వాల్‌ వద్ద కారు దగ్ధం

హైదరాబాద్: అకస్మాత్తుగా మంటలు చెలరేగి కారు దగ్ధమైన ఘటన సంగారెడ్డి జిల్లా దిగ్వాల్ వద్ద చోటు చేసుకుంది. 65వ నెంబరు జాతీయ రహదారిపై జహీరాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు ఇంజిన్‌లో మంటలు వ్యాపించి క్షణాల్లో వాహనమంతా కాలి బూడిదయింది. అప్రమత్తమైన కారు డ్రైవర్ సహా మరో వ్యక్తి కిందకు దిగిపోవడం వల్ల ప్రాణాపాయం తప్పింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు హైదరాబాద్‌కు  చెందిన స్థిరాస్తి వ్యాపారులుగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి జహీరాబాద్ అగ్నిమాపక కేంద్రం ఫైర్ ఇంజన్ చేరుకుని మంటలు అదుపు చేసే లోపు కారు బుగ్గిపాలయింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని