Raj kundra: అశ్లీల చిత్రాల కేసు.. రాజ్‌ కుంద్రాకు బెయిల్‌ మంజూరు

తాజా వార్తలు

Updated : 20/09/2021 20:11 IST

Raj kundra: అశ్లీల చిత్రాల కేసు.. రాజ్‌ కుంద్రాకు బెయిల్‌ మంజూరు

 

ముంబయి: అశ్లీల చిత్రాల నిర్మాణం, ప్రసారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త, ప్రముఖ బాలీవుడ్‌ తార శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాకు బెయిల్‌ మంజూరైంది. ఈ కేసులో అరెస్టయిన దాదాపు రెండు నెలల తర్వాత ఆయనకు బెయిల్‌ వచ్చింది. రూ.50వేల పూచీకత్తుపై ముంబయి కోర్టు ఆయనకు సోమవారం బెయిల్‌ను మంజూరు చేసింది. పోర్నోగ్రఫీ కేసులో జులై 19న రాజ్‌కుంద్రా సహా పలువురిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ఇటీవల 1400 పేజీల ఛార్జ్‌షీట్‌ను కూడా దాఖలు చేశారు. ఈ కేసులో సాక్షుల జాబితాలో శిల్పాశెట్టి పేరునూ పోలీసులు చేర్చారు. ఈ క్రమంలో ఆమెను విచారించగా.. తన భర్త కార్యకలాపాల గురించి తనకు తెలియదని పేర్కొన్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని