ఆటబొమ్మలో డ్రగ్స్‌.. షాకైన తల్లిదండ్రులు!

తాజా వార్తలు

Published : 26/02/2021 01:18 IST

ఆటబొమ్మలో డ్రగ్స్‌.. షాకైన తల్లిదండ్రులు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమ చిన్నారికి బొమ్మ కొనిచ్చి సంతోషపెడదామని భావించిన తల్లిదండ్రులు ఆ బొమ్మలో డ్రగ్స్‌ దొరకడంతో షాకయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు.. బొమ్మను, బొమ్మలో లభించిన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో అమెరికాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఆరిజోనాకు చెందిన దంపతులు ఇటీవల సెకండ్‌హ్యాండ్‌ వస్తువులు విక్రయించే ఓ దుకాణంలో తమ చిన్నారి కోసం బొమ్మను కొనుగోలు చేశారు. ఎంతో ముద్దుగా ఉన్న ఆ బొమ్మలో లైట్లు వెలుగుతాయి.. నొక్కితే చక్కటి సంగీతం వినిపిస్తుంది. ఆ బొమ్మని శుభ్రం చేద్దామని దానికున్న జిప్‌ తెరచిచూస్తే అందులో డ్రగ్స్‌ బయటపడ్డాయి. దాదాపు 5 వేలకుపైగా ఫెంటానిల్‌ డ్రగ్స్‌ బిళ్లలు ఉన్నాయి. గతంలో ఈ బొమ్మ యజమానే వీటిని పెట్టి ఉంటాడని ఆ దంపతులు భావించారు. ఈ విషయంపై ఫీనిక్స్‌ పోలీసులు సమాచారం అందుకొని ఇంటికి వచ్చి బొమ్మ.. డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఫీనిక్స్‌ పోలీసులు సోషల్‌మీడియాలో పోస్టు చేస్తూ సెకండ్‌హ్యాండ్‌ బొమ్మలు కొనుగోలు చేసినప్పుడు వాటిని బాగా పరిశీలించాలని ప్రజలకు సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని