Rajasthan: భార్య ముఖం కప్పుకోలేదని..కోపంలో కూతుర్ని విసిరేశాడు!

తాజా వార్తలు

Published : 20/08/2021 06:41 IST

Rajasthan: భార్య ముఖం కప్పుకోలేదని..కోపంలో కూతుర్ని విసిరేశాడు!

రాజస్థాన్‌: కట్టుకున్న భార్య తన ముఖాన్ని ముసుగుతో కప్పుకోలేదని కోపంతో ఓ భర్త తన మూడేళ్ల కూతుర్ని లాక్కొని విసిరేశాడు. దీంతో ఆ పసికందు అక్కడికక్కడే మరణించింది. ఈ హృదయవిదారక ఘటన రాజస్థాన్‌లోని అల్వార్‌ జిల్లాలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రదీప్‌ అనే వ్యక్తికి మోనిక యాదవ్‌తో వివాహమైంది. వారికి మూడేళ్ల పాప ఉంది. వివాహం జరిగినప్పటి నుంచి మోనికను ఎప్పుడూ ముఖంపై ముసుగు ధరించాలని ప్రదీప్‌ పట్టుబట్టేవాడు. ఈ క్రమంలో  వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపంలో తన భార్యను, కూతుర్ని ప్రదీప్‌ కొట్టాడు. అదే కోపంలో చిన్నారిని లాక్కొని ఇంటి నుంచి బయటికి విసిరేశాడు. దీంతో మూడేళ్ల చిన్నారి అక్కడికక్కడే మరణించింది. దీంతో మోనిక తన కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడని..అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని