చిత్రహింసలు పెట్టి దళిత మహిళపై అత్యాచారం

తాజా వార్తలు

Updated : 27/01/2021 08:24 IST

చిత్రహింసలు పెట్టి దళిత మహిళపై అత్యాచారం

నాగౌర్‌ : రాజస్థాన్‌లోని నాగౌర్‌ జిల్లా గంగ్వాలో ముగ్గురు కిరాతకులు ఓ దళిత మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. గాజు సీసాను.. ఆమె సున్నిత భాగాల్లో ఉంచి చిత్రహింసలకు గురి చేశారు. ఈ నెల 19న జరిగిన ఈ దుర్ఘటనపై బాధితులు సోమవారం ఫిర్యాదు చేశారు. నిందితుల బెదిరింపులకు భయపడి బాధితురాలు మొదట ఫిర్యాదు చేయలేదని సమాచారం. ఎట్టకేలకు ఘటన జరిగిన 5 రోజులకు బాధితురాలి కుటుంబ సభ్యులు పర్బత్‌సర్‌ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. మూడ్రోజుల క్రితమే ఠాణాకు వచ్చామని.. కానీ బదిలీ అయిన కారణంగా ఫిర్యాదుని స్వీకరించలేనని స్టేషన్‌ ఇన్‌ఛార్జి పేర్కొన్నారని తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఇవీ చదవండి..
పట్టపగలు.. ప్రాణం తీసిన పగలు
16 హత్యలు చేసిన సైకో అరెస్టు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని