కన్నతల్లే కర్కోటకురాలు

తాజా వార్తలు

Updated : 25/03/2021 14:53 IST

కన్నతల్లే కర్కోటకురాలు

 

చిక్కమగళూరు : బాలికపై ఏడాదిగా 30 మంది అత్యాచారానికి పాల్పడిన సంఘటన కొత్త మలుపు తిరిగింది. ఇందులో కన్నతల్లే ప్రధాన పాత్ర పోషించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. కర్ణాటక రాష్ట్రం చిక్కమగళూరు జిల్లాలోని శృంగేరిలో ఓ బాలికపై ఏడాదిగా 30 మంది అత్యాచారానికి పాల్పడిన సంఘటన తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

 ఈ సంఘటనకు సంబంధించి బాలిక ఫిర్యాదు ఆధారంగా ఇప్పటికే 30 మంది కామాంధుల్ని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తును కొనసాగించే కొద్దీ అనూహ్య సంఘటనలు వెలుగులోకి వస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకెళ్తే.. ఉత్తర కర్ణాటక నుంచి కూతురుతో వచ్చిన ఓ మహిళ తనను భర్త వదిలేశాడని అందుకే తన సోదరి కుమార్తెతో శృంగేరికి వచ్చానంది. ఆ సమయంలోనే ఓ వ్యక్తితో వివాహమైనా.. కొంతకాలానికే అతడితో తెగతెంపులు చేసుకుంది. తన సోదరి కుమార్తె అని కొందరికి,  తన భర్తకు అతని మొదటి భార్యకు పుట్టిన సంతానమని మరికొందరికి ఆ బాలిక గురించి చెబుతూ వచ్చింది. ఏడాదిగా తనపై 30 మంది అత్యాచారం చేస్తున్నారంటూ బాలిక ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా అన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. పినతల్లిగా చెప్పుకొనే ఆ మహిళ కన్నతల్లేనని.. డబ్బు కోసం కూతురితో వ్యభిచారం చేయిస్తోందని విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. శృంగేరి పోలీసులు కేసు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని