
తాజా వార్తలు
కారు ఢీకొని ఇద్దరి మృతి
కాకినాడ: ద్విచక్రవాహనంపై వెళ్తు్న్న వారిని కారు ఢీకొన్న ప్రమాదంలో తూర్పు గోదావరి జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. చింతూరు మండలం చట్టి వద్ద రాజమహేంద్రవరం వైపు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు చింతూరు మండలం నరసింహాపురం గ్రామానికి చెందిన రామకృష్ణ (26), సీతయ్య(48)గా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Tags :