Ts News: లారీ బీభత్సం.. నలుగురు మృతి
close

తాజా వార్తలు

Published : 19/06/2021 01:09 IST

Ts News: లారీ బీభత్సం.. నలుగురు మృతి

జడ్చర్ల: మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జడ్చర్ల మండల పరిధిలోని గంగాపూర్‌ వద్ద కాంక్రీట్‌ మిక్సర్‌ లారీ బీభత్సం సృష్టించింది. రెండు ద్విచక్ర వాహనాలు, ఒక ట్రాక్టర్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. జడ్చర్ల వైపు నుంచి గంగాపూర్‌ వైపు వెళ్తున్న కాంక్రీట్‌ మిక్సర్‌ లారీ ముందు ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనాలపై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. లారీ ఎదురుగా వెళ్తున్న ట్రాక్టర్‌ ట్రాలీ బోల్తా పడటంలో ట్రాక్టర్‌ డ్రైవర్‌ సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మృతులను గంగాపూర్‌కి చెందిన రవి, రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెంకటాపూర్‌కు చెందిన సురేశ్‌, ఫార్మా పరిశ్రమలో పనిచేస్తున్న వెంకటేశ్వర్లుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని