Crime news: ‘మహా’ దారుణం.. మహిళపై కిరాతక లైంగిక దాడి!

తాజా వార్తలు

Published : 11/09/2021 02:26 IST

Crime news: ‘మహా’ దారుణం.. మహిళపై కిరాతక లైంగిక దాడి!

ముంబయి: దేశ ఆర్థిక రాజధాని ముంబయి నగరంలో ఘోరం చోటుచేసుకుంది. 32 ఏళ్ల మహిళపై అత్యంత కిరాతకంగా లైంగిక దాడి జరిగింది. మహిళపై అత్యాచారం చేసిన అనంతరం ఆ నరరూప రాక్షసులు బాధితురాలి రహస్య అవయవాలపై రాడ్డుతో దాడి చేసి నడి రోడ్డుపైనే రక్తపు మడుగులో వదిలి వెళ్లిపోయారు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన మహిళ ప్రస్తుతం ఓ ఆస్పత్రిలో ప్రాణాల కోసం పోరాడుతోంది. ఈ పాశవిక ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబయిలోని సాకినాక ప్రాంతంలోని ఖైరానీ రహదారి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో రహదారిపై ఓ మహిళ రక్తపు మడుగులో స్పృహ కోల్పోయి ఉన్నట్టు తమ ప్రధాన కాల్‌ సెంటర్‌కు సమాచారం వచ్చినట్టు తెలిపారు. వెంటనే అక్కడికి చేరుకొని బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు.

బాధితురాలి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిని అరెస్టు చేసి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు. అయితే, ఈ పాశవిక ఘటనలో మరికొంత మంది ప్రమేయం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, ఈ ఘటన ఏ రోజు జరిగిందనే విషయం మాత్రం కచ్చితంగా తెలియరాలేదు. మరోవైపు, ఆ ప్రాంత డీసీపీతో పాటు ఏసీపీ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని