విద్యుదాఘాతం: ఒకే కుటుంబంలో ఆరుగురి మృతి

తాజా వార్తలు

Published : 11/07/2021 14:20 IST

విద్యుదాఘాతం: ఒకే కుటుంబంలో ఆరుగురి మృతి

భోపాల్: విద్యుదాఘాతం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. కరెంట్‌ షాక్‌కు గురై ఒకే కుటుంబంలో ఆరుగురు మృత్యువాతపడ్డారు. మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్‌ జిల్లా బిజావర్‌లో ట్యాంకు శుభ్రం చేస్తుండగా ఇవాళ ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మహువాఝాలా గ్రామంలో జగన్‌ అహిర్వార్‌ కుటుంబం ఓ సెప్టిక్‌ ట్యాంకును నిర్మిస్తోంది. పని చేసేటప్పుడు వెలుతురు కోసం అందులో ఓ విద్యుత్‌ బల్బును ఉంచారు. పనంతా పూర్తయిపోవడంతో నిర్మాణ వ్యర్థాలను బయటకు తీసేందుకు జగన్‌ ఆహివార్‌ కుమారుడు అందులోకి దిగి విద్యుదాఘాతానికి గురయ్యాడు. అతడిని రక్షించేందుకు వెళ్లిన ఆరుగురు కుటుంబ సభ్యులు షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయారు. మృతులను నరేంద్ర (20), రామ్‌ ప్రసాద్‌ (30), విజయ్‌ (20), లక్ష్మణ్ (55), శంకర్‌ అహిర్వార్‌ (35),మిలాన్‌ (25)గా గుర్తించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని