సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని హత్యకేసు ఛేదించిన పోలీసులు

తాజా వార్తలు

Updated : 03/07/2021 08:49 IST

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని హత్యకేసు ఛేదించిన పోలీసులు

తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతిలో భార్యను హత్య చేసి సూట్‌కేసులో తీసుకెళ్లి దహనం చేసిన భర్త శ్రీకాంత్‌రెడ్డిని పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. చనిపోయిన రోజు రాత్రంతా ఇంట్లోనే ఉంచి మరుసటి రోజు మధ్యాహ్నం శవాన్ని సూట్‌కేస్‌లో తీసుకెళ్లి దహనం చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. నిందితుడు శ్రీకాంత్‌పై గతంలోనే కడపలో చీటింగ్‌ కేసు ఉందని అదనపు ఎస్పీ సుప్రజ మీడియాకు వెల్లడించారు.

‘‘కడప జిల్లా బద్వేలుకు చెందిన శ్రీకాంత్‌రెడ్డి, చిత్తూరు జిల్లా రామసముద్రానికి చెందిన భువనేశ్వరి(27)ని మూడేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. శ్రీకాంత్‌రెడ్డి అవినీతి నిర్మూలన పేరిట ఓ సంస్థను స్థాపించాడు. రూ.90 వేలు జీతం తీసుకునే భార్యను వేధించేవాడు. ఆమె జీతం విలాసాలకు ఖర్చు చేసేవాడు. కట్నం కోసం ఆమెను వేధించేవాడు. గత నెల 21న కూడా భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. 22వ తేదీ తెల్లవారుజామున భువనేశ్వరి నిద్రిస్తుండగా.. ముఖంపై దిండుతో అదిమిపెట్టి ఊపిరాడకుండా చేసి హతమార్చాడు. ఆమె చనిపోయిన తర్వాత ఆ రోజు రాత్రంతా మృతదేహాన్ని అపార్ట్‌మెంట్‌ బెడ్ రూమ్‌లోనే ఉంచాడు. మరుసటి రోజు ఉదయం పెద్ద సూట్‌కేస్‌ కొనుగోలు చేసి అందులో భువనేశ్వరి మృతదేహాన్ని ప్యాక్‌ చేశాడు. మధ్యాహ్నం క్యాబ్‌ బుక్‌ చేసుకొని రుయా ఆసుపత్రికి తీసుకెళ్లాడు. క్యాబ్‌ డ్రైవర్‌కు అనుమానం రాకుండా సూట్‌కేస్‌లో వెంటిలేటర్‌ ఉందని చెప్పాడు. రుయా ఆసుపత్రి ప్రాంగణంలోని డ్రగ్స్‌ స్టోర్‌ వద్దకు చేరుకుని మృతదేహం ఆనవాళ్లు లేకుండా పెట్రోల్‌ పోసి కాల్చేశాడు. అనంతరం భువనేశ్వరి కరోనా డెల్టా ప్లస్‌ వైరస్‌తో చనిపోయిందని చెప్పి బంధువులకు సమాచారమందించాడు. మరుసటి రోజు కాలిన మనిషి అవశేషాలు వెలుగులోకి రావడంతో కూతురిని రామసముద్రంలోని అమ్మమ్మకు అప్పగించి పరారయ్యాడు. చివరకు మృతురాలి అక్క కుమార్తెకు అనుమానం వ్యక్తం చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. భువనేశ్వరి హత్య తర్వాత ఆమె ఒంటిపై ఉన్న ఆభరణాలను కూడా శ్రీకాంత్‌ తీసుకెళ్లాడు. అవన్నీ స్వాధీనం చేసుకున్నాం’’ అని అదనపు ఎస్పీ వెల్లడించారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని