విద్యార్థినిని గొంతుకోసి చంపిన ప్రేమోన్మాది

తాజా వార్తలు

Updated : 18/06/2021 20:08 IST

విద్యార్థినిని గొంతుకోసి చంపిన ప్రేమోన్మాది

బద్వేలు: కడప జిల్లా బద్వేలు మండలం చింతల చెరువులో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు విద్యార్థినిని ఆమె ఇంటి వద్దే గొంతుకోసి హతమార్చాడు. దాడి చేసిన యువకుడిని గ్రామస్థులు పట్టుకుని చితకబాదారు. తీవ్రంగా గాయపడిని నిందితుడిని బద్వేలు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గత కొంత కాలంగా ప్రేమిస్తున్నానంటూ యువకుడు విద్యార్థినిని వెంట పడుతున్నట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఇద్దరూ బీవీఆర్‌ కళాశాలలో డిగ్రీ చదువుతున్నట్టు గుర్తించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని