Tollywood Drugs Case: 6 గంటలుగా పూరీ జగన్నాథ్‌ను ప్రశ్నిస్తున్న ఈడీ అధికారులు

తాజా వార్తలు

Updated : 31/08/2021 19:08 IST

Tollywood Drugs Case: 6 గంటలుగా పూరీ జగన్నాథ్‌ను ప్రశ్నిస్తున్న ఈడీ అధికారులు

హైదరాబాద్‌: సంచలనం సృష్టించిన టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారణ కొనసాగుతోంది. దాదాపు 8 గంటలుగా దర్శకుడు పూరీ జగన్నాథ్‌ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. పూరీ జగన్నాథ్‌ వెంట ఆయన చార్టెడ్‌ అకౌంటెంట్‌ కూడా ఉన్నారు. ఈరోజు ఉదయం 10.30 గంటలకు ఈడీ అధికారులు పూరిని ప్రశ్నించడం మొదలు పెట్టారు... మధ్యాహ్నం భోజన విరామం తర్వాత తిరిగి విచారణ కొనసాగించారు. పూరీ జగన్నాథ్‌ బ్యాంకు లావాదేవీలపై కూడా ఈడీ అధికారులు దృష్టిసారించారు. ఎక్సైజ్‌ సిట్‌ విచారణకు భిన్నంగా ఈడీ దర్యాప్తు సాగుతోంది. మనీలాండరింగ్‌ కోణంలోనే ప్రధానంగా ఈడీ ప్రశ్నలు సంధించి వివరాలు సేకరిస్తోంది. ఇప్పటికే ఎక్సైజ్‌ సిట్‌ నుంచి కూడా ఈడీ వివరాలు సేకరించింది. సినీ రంగానికి చెందిన 12 మంది బ్యాంకు ఖాతాలను ఈడీ అధికారులు పరిశీలించే అవకాశముంది. 

డ్రగ్స్‌ కేసులో సెప్టెంబర్ 2వ తేదీన చార్మి, 6న రకుల్ ప్రీత్ సింగ్, 8న రానా దగ్గుబాటి, 9న రవితేజ, శ్రీనివాస్, 13న నవదీప్‌తో పాటు ఎఫ్ క్లబ్ మేనేజర్, 15న ముమైత్ ఖాన్, 17న తనీశ్, 20న నందు, 22వ తేదీ తరుణ్ ఈడీ అధికారుల ఎదుట హాజరు కావాల్సి ఉంది. నాలుగేళ్ల క్రితం హైదరాబాద్‌లో ఎక్సైజ్‌ అధికారులకు చిక్కిన కొందరు డ్రగ్స్‌ విక్రేతల విచారణలో పలువురు సినీ ప్రముఖుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. సినీ ప్రముఖులను ఎక్సైజ్‌ అధికారులు సుదీర్ఘంగా విచారణ జరిపారు. రక్తం, గోళ్లు, వెంట్రుకల శాంపిల్స్‌ సేకరించి పరీక్షలకు పంపించారు. అయితే, సినీ ప్రముఖులకు క్లీన్‌చీట్‌ ఇచ్చిన ఎక్సైజ్‌ అధికారులు.. పలువురు డ్రగ్స్‌ విక్రేతలపై 12 ఛార్జిషీట్లు దాఖలు చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని