ఉద్యోగాలు పోయాయని.. మోసాలకు తెగబడ్డారు!

తాజా వార్తలు

Published : 21/07/2021 08:21 IST

ఉద్యోగాలు పోయాయని.. మోసాలకు తెగబడ్డారు!

 
విజయ్‌ ధావన్‌,                          కపిల్‌ ఠాగూర్‌                           అభయ్‌వర్మ

నారాయణగూడ, న్యూస్‌టుడే: రుణాలిప్పిస్తామంటూ రూ.లక్షలు దోచేస్తున్న ముగ్గురు సైబర్‌ కేటుగాళ్లను హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. ఏసీసీ కె.వి.ఎం.ప్రసాద్‌ కథనం ప్రకారం.. సికింద్రాబాద్‌కు చెందిన అనీల్‌కుమార్‌ కొవిడ్‌ కాలంలో అప్పులపాలయ్యారు. బ్యాంకులు, ఫైనాన్స్‌ కంపెనీల్లో లోన్‌ కోసం సంప్రదిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఫైనాన్స్‌ సంస్థ ప్రతినిధులమంటూ ముగ్గురు వ్యక్తులు మాట కలిపారు. లోన్‌ ఆశ చూపి బాధితుడి నుంచి రూ.9.44 లక్షలు దోచేశారు. అనీల్‌కుమార్‌ జూన్‌ 17న పోలీసులకు ఫిర్యాదు చేయగా.. రంగంలో దిగిన సైబర్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటరామరెడ్డి బృందం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితుల జాడ తెలుసుకుంది. మంగళవారం దిల్లీకి వెళ్లి ముగ్గురు మోసగాళ్లను పట్టుకొచ్చారు.

పంజాబ్‌కు చెందిన విజయ్‌ ధావన్‌ దిల్లీలో ఓ కాల్‌ సెంటర్‌లో పనిలో చేరాడు. అక్కడ అభయ్‌, కపిల్‌ ఠాగూర్‌ విజయ్‌ ధావన్‌కు స్నేహితులయ్యారు. కొవిడ్‌ దెబ్బతో ఈ ముగ్గురు ఉపాధి కోల్పొయారు. దీంతో మోసాలకు తెగబడ్డారు. విజయ్‌ ధావన్‌ ఉంటున్న ఇంటినే కాల్‌ సెంటర్‌గా మార్చేశారు. దక్షిణాది రాష్ట్రాల ప్రజలను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఇలానే అనీల్‌కుమార్‌ నుంచి రూ.9.44 లక్షలు దండుకున్నారు. నిందితుల నుంచి రూ.2 లక్షల నగదు, 8 చరవాణులు, డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు, చెక్కు, పాస్‌ పుస్తకాలు స్వాధీనం చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ వెంకటరామిరెడ్డి తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని