Crime news: 14 ఏళ్ల బాలికపై దారుణం.. సుత్తితో కొట్టి అత్యాచారం

తాజా వార్తలు

Published : 13/09/2021 06:42 IST

Crime news: 14 ఏళ్ల బాలికపై దారుణం.. సుత్తితో కొట్టి అత్యాచారం

మహారాష్ట్రలోని ఠాణె జిల్లాలో ఘటన

ఠాణె, ముంబయి: మహారాష్ట్రలో మహిళలపై అకృత్యాలు ఆగడం లేదు. 14 ఏళ్ల బాలికపై సుత్తితో దాడి చేసి, అనంతరం అత్యాచారం చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని ఠాణె జిల్లా ఉల్హాస్‌ నగర్‌ పట్టణంలో శుక్రవారం రాత్రి  ఈ దారుణం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. శిర్డీకి చెందిన బాధిత బాలిక.. ప్రైవేటు బస్సులో కల్యాణ్‌లోహ్‌ మార్గ్‌ ప్రాంతానికి శుక్రవారం రాత్రి చేరుకుంది. అక్కడి నుంచి తన స్నేహితులను కలిసేందుకు ఉల్హాస్‌ నగర్‌ రైల్వేస్టేషన్‌కు లోకల్‌ రైలులో వెళ్లింది. అక్కడ తన ఇద్దరు మిత్రులను కలిసింది. వారితో కలిసి స్కైవేపై నడుచుకుంటూ వెళుతుండగా.. శ్రీకాంత్‌ గైక్వాడ్‌ (30) అనే వ్యక్తి ఉన్నట్టుండి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. బాలిక ముఖానికి కట్టుకున్న వస్త్రాన్ని బలవంతంగా లాగేశాడు. అనంతరం సుత్తితో తలపై కొట్టాడు. అడ్డుపడితే మీపైనా దాడి చేస్తానంటూ స్నేహితులను బెదిరించాడు. దీంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం నిందితుడు బాలికను రైల్వేస్టేషన్‌కు సమీపంలోని ఓ పాత భవనంలోకి తీసుకుపోయి అత్యాచారం చేశాడు. అక్కడి నుంచి బాధితురాలు తప్పించుకోవడానికి యత్నించగా మళ్లీ కొట్టాడు. శనివారం ఉదయం శ్రీకాంత్‌ లేని సమయంలో బాధితురాలు తప్పించుకుని ఇంటికి చేరుకుంది. అనంతరం ఆమె కుటుంబ సభ్యులు కల్యాణ్‌ రైల్వే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శనివారం రాత్రి పోలీసులు శ్రీకాంత్‌ గైక్వాడ్‌ను అరెస్టు చేశారు. పోక్సో సహా వివిధ చట్టాల కింద కేసు నమోదు చేశారు.

చిన్నారిని లాక్కెళ్లి..
తన స్నేహితులతో కలిసి మూత్ర విసర్జనకు వెళ్లిన చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మహారాష్ట్రలోని అమరావతి జిల్లా అంజన్‌గావ్‌సుర్జి మండలం వంజ గ్రామానికి చెందిన ఏడేళ్ల చిన్నారి.. తన స్నేహితులతో కలిసి మూత్ర విసర్జనకు వెళ్లింది. అదే సమయంలో అక్కడకు వచ్చిన ఓ యువకుడు.. బలవంతంగా బాలికను తన ద్విచక్రవాహనంపై తీసుకెళ్లాడు. కొద్దిదూరం వెళ్లాక తన పొలంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేశారు.


Advertisement

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని