Crime News: స్లీపర్‌ బస్సులో బాలికపై అత్యాచారం

తాజా వార్తలు

Updated : 22/09/2021 09:37 IST

Crime News: స్లీపర్‌ బస్సులో బాలికపై అత్యాచారం

ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం

ఫిరోజాబాద్‌, అలీగఢ్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణాలకు తెరపడట్లేదు. 15 ఏళ్ల బాలిక తన తల్లి, కుటుంబసభ్యులతో బదర్‌పుర్‌ నుంచి ఔరియా వెళ్లేందుకు సోమవారం రాత్రి 11 గంటలకు స్లీపర్‌ బస్సు ఎక్కింది. మార్గమధ్యంలో బస్సు ఆగినప్పుడు.. ఆమె కుటుంబ సభ్యులు, ఇతర ప్రయాణికులు కిందకు దిగారు. ఆ సమయంలో కండక్టర్‌ బబ్లూ సహచరుడు అషు.. బాలికపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ ఘోరాన్ని ఆమె తన తల్లికి వివరించింది. బస్సును ఆపేందుకు తల్లి ప్రయత్నించగా బబ్లూ ఆమెను లాగి పడేశాడు. అనంతరం బబ్లూ, అషు బస్సు దిగి వెళ్లిపోయారు. ఈ వ్యవహారంపై శిఖోహాబాద్‌ పోలీసు స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అషును అరెస్టు చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని